ETV Bharat / sitara

శిల్పారెడ్డికి కరోనా.. సామ్​-చైతూల్లో భయం! - Samantha fans worried

అక్కినేని ఫ్యామిలీ స్టార్​ కపుల్​ సమంత-నాగచైతన్యకు కరోనా సోకుతుందేమోనన్న భయాలు అభిమానుల్లో చుట్టుముట్టాయి. తాజాగా కరోనా నిర్ధరణ అయిన ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ శిల్పారెడ్డితో సామ్​ సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం.

sam
సమ్​-చైతూ
author img

By

Published : Jun 23, 2020, 11:17 AM IST

టాలీవుడ్​ రియల్​ లైఫ్​ కపుల్​ సమంత-నాగచైతన్యకు కరోనా సోకుతుందేమోనన్న అనుమానాలు సోషల్​ మీడియాలో వెలువెత్తుతున్నాయి. ఈ వార్తలు చూసిన అభిమానులు షాకవుతున్నారు. తాజాగా సామ్​ స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ శిల్పా రెడ్డి, ఆమె భర్తకు కరోనా పాజిటివ్​ అని తేలడమే ఇందుకు కారణం.

ఇటీవల సామ్​, శిల్పా రెడ్డిని గట్టిగా హత్తుకుని ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టిన ఫొటోను శిల్పా ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. మరి వీరిద్దరు గతంలో కలుసుకున్నప్పుడు దిగినా ఫొటోనా? లేదా ఇటీవల కాలంలో దిగిందా? అన్నది స్పష్టత లేదు. దీంతో సామ్​- చైతూ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో భయాలు అలుముకున్నాయి. అయితే ఈ విషయంపై వీరిద్దరు ఇంకా స్పందించలేదు.

ప్రస్తుతం చైతూ 'లవ్​స్టోరీ'లో నటిస్తుండగా.. 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్​2 వెబ్​ సిరీస్​లో సమంత నటించింది. ఈ సిరీస్​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చూడండి : 'లవ్​బర్డ్స్'​ నయనతార​-విఘ్నేశ్​కు కరోనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.