ముంబయి(mumbai rave party bollywood) క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీ కేసులో Mumbai Rave Party news) బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్(Mumbai Rave Party Superstar Son) అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం మాదకద్రవ్యాల నిరోధక శాఖ అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. దీంతో కలవరపాటుకు గురైంది బాద్షా కుటుంబం. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే స్టార్ హీరో సల్మాన్ ఖాన్(shahrukh khan salman khan house) కూడా షారుక్‌కు మద్దతుగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఆయన.. బాద్షా ఇంటికి వెళ్లాడు.
సల్మాన్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు, మీడియా మిత్రులు షారుక్(salman khan sharukh khan) ఇంటి బయట పెద్ద ఎత్తున గుమిగూడారు. సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఓపిక పడదాం
కాగా, ఆర్యన్ ఖాన్‌కు(aryan khan drugs case) మద్దతుగా మరో సీనియర్ నటుడు సునీల్‌శెట్టి కూడా మాట్లాడాడు. ఈ కేసులో పట్టుబడ్డ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా మిగతా కుర్రాళ్ల విషయంలో దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించాడు. నిజమైన నివేదిక వచ్చిన తర్వాతే ఓ అంచనాకి రావాలన్నాడు. ఎవరైనా ఇలాంటి కేసుల్లో పట్డుబడితే అనేక రకాలుగా ఊహించుకోవడం సహజమని పేర్కొన్నాడు. కుర్రాళ్లని సంరక్షించుకోవడం మన బాధ్యత అని అన్నారు.
ఇదీ జరిగింది
ముంబయి(mumbai rave party news) నగర శివారులోని తీరప్రాంతంలో క్రూజ్ నౌకపై శనివారం(అక్టోబర్ 2) నిర్వహించిన ఓ రేవ్‌పార్టీలో ఆర్యన్‌తోపాటు(ncb raids cruise drugs party) మరికొందరు హాజరయ్యారు. అక్కడ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్. సి.బి) అధికారులు సోదా చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్యన్‌తో సహా పలువురిని అరెస్ట్ చేశారు.
సంగీత హోరులో సముద్ర ప్రయాణం
ఓ టీవీ ఛానల్ భాగస్వామిగా నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో సంగీత హోరు నడుమ రెండు రోజుల సముద్ర ప్రయాణం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2 - 4 తేదీల మధ్య ఉంటుందని ప్రకటించారు. వంద టికెట్లను మాత్రమే విక్రయానికి ఉంచి, మిగిలినవి నిర్వాహకులే అమ్మారు. సంపన్నులు ఎగబడ్డ ఈ పార్టీ కోసం చాలామంది టికెట్లు కొని కూడా ఓడ ఎక్కలేకపోయారు. ఓ మహిళ రూ.82 వేలు చెల్లించినా షిప్ నిండిపోయిందంటూ ఆమెను వెనక్కు పంపారు. ఈ ఓడ ప్రయాణికులు సామర్థ్యం 1,800. ఇటువంటి పార్టీల్లో ముఖ్యంగా ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్స్‌ను వినియోగిస్తుంటారు.
సమీర్ వాంఖెడె నేతృత్వంలో..
సమర్థుడైన అధికారిగా పేరున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె నేతృత్వంలో 22 మంది ఎన్సీబీ అధికారులు ప్రయాణికుల్లా నటిస్తూ ఓడ ఎక్కారు. సముద్రం మధ్యలోకి ఓడ వెళ్లిన తర్వాత పార్టీ మొదలైంది. అదను చూసి అధికారులు దాడికి దిగారు. కాగా, ఈ సంఘటనతో తమకెలాంటి సంబంధం లేదని.. అధికారులతో పూర్తిగా సహకరిస్తామని గోవాకు చెందిన ఓడ కంపెనీ ప్రకటించింది. గత కొన్నిరోజులుగా దేశంలో మాదకద్రవ్యాల ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సెప్టెంబరులో గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో భారీగా 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. దిల్లీ, నోయిడాల్లోనూ 37 కిలోల మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ముంబయిలోనూ సమీర్ వాంఖెడె బృందం గత రెండేళ్లలో మొత్తం రూ.17,000 కోట్ల డ్రగ్స్ పట్టుకుంది.
హీరోగా వస్తాడనుకుంటే..
బాలీవుడ్ హీరోగా జనం ముందుకొచ్చే దశలో కుమారుడు ఆర్యన్‌ఖాన్(cruise drug party in mumbai) డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం షారుక్(aryan khan detained in drug case) కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. నటి దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్న 'పఠాన్' చిత్రం పాట చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన షారుక్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటికప్పుడు కేసు పురోగతి గురించి తెలుసుకొంటూ, న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతూ గడిపారు. ఆర్యన్‌ఖాన్ తల్లి గౌరీఖాన్ కూడా కుమారుడి అరెస్టు గురించి విని కుంగిపోయారు. విదేశాల్లో చదివి, తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సాధించిన ఆర్యన్ మీడియాకు దూరంగా ఉంటున్నా.. ఇన్‌స్టాలో 14 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.
ఇదీ చూడండి:
Drugs case news: షారుక్ తనయుడి గురించి ఈ విషయాలు తెలుసా?
'డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు.. విచారణ తర్వాత కోర్టుకు'