ETV Bharat / sitara

చిరంజీవి కోసమే 'సానా కష్టం..' పాట చేశా: రెజీనా - chiranjeevi acharya release date

Chiru regina song: చిరంజీవిని మెగాస్టార్​ అని ఎందుకు పిలుస్తారో సెట్స్​లో ఆయనను చూస్తే అర్థమైందని రెజీనా చెప్పింది. కేవలం ఆయన కోసం 'సానా కష్టం..' పాట చేశానని తెలిపింది.

regina
రెజీనా
author img

By

Published : Jan 7, 2022, 7:01 AM IST

Saana kastam song: హీరో చిరంజీవి కోసమే తాను 'ఆచార్య'లోని ప్రత్యేక గీతంలో నర్తించానని రెజీనా చెప్పింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా.. ఈ పాట గురించి కొన్ని విశేషాలను తెలిపింది. సినిమా చిత్రీకరణ ఈ పాటతోనే మొదలైందని, నాలుగు రాత్రుల్లో పాటను పూర్తిచేశామని చెప్పింది.

తానెప్పుడూ ఇలాంటి పార్టీ సాంగ్స్‌/ ప్రత్యేక గీతాల్లో నటించలేదని, చిరంజీవి కోసమే తొలిసారి నర్తించానని రెజీనా చెప్పుకొచ్చింది. చిరును మెగాస్టార్‌ అని ఎందుకు పిలుస్తారో సెట్స్‌లో చూస్తే అర్థమైందని తెలిపింది. చిరంజీవి డ్యాన్స్‌ తనకెంతో ఇష్టమని, ఆయన యువతరం నటులను ప్రోత్సహిస్తుంటారని ఆనందం వ్యక్తం చేసింది. 'సానా కష్టం వచ్చిందే మందాకిని' అంటూ సాగే ఈ పాట ఇటీవల విడుదలై శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తీసిన సినిమా 'ఆచార్య'. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌, పూజాహెగ్డే కీలక పాత్రలు పోషించారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో సోషల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.