ETV Bharat / sitara

'రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మళ్లీ పుట్టా' - HERO KARTHIKEYA EMOTIONAL TWEET ON 'RX 100' COMPLETES TWO YEARS

'ఆర్​ఎక్స్ 100' సినిమాకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కార్తికేయ ఎమోషనల్​ ట్వీట్ చేశారు. ఈరోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

'రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మళ్లీ పుట్టా'
హీరో కార్తికేయ
author img

By

Published : Jul 12, 2020, 8:01 PM IST

టాలీవుడ్​ యువహీరో కార్తికేయ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు తాను మళ్లీ పుట్టానని, అందుకు కారణమైన తన తండ్రి అజయ్ భూపతికి(దర్శకుడు) జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తాను నటించిన 'ఆర్​ఎక్స్ 100' విడుదలై, రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

KARTHIKEYA EMOTIONAL TWEET
హీరో కార్తికేయ ట్వీట్

"జులై 12.. నా జీవితంలో లేచి నిలబడిన రోజు. అద్భుతాలపై నమ్మకం, కలలపై విశ్వాసం, జీవితంలో ఆశ కల్పించిన రోజు ఇదే. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు మళ్లీ పుట్టాను. నా పునర్జన్మ తండ్రి అజయ్ భూపతికి జీవితాంతం రుణపడి ఉంటాను" -కార్తికేయ, యువ కథానాయకుడు

hero karthikeya
దర్శకుడు అజయ్ భూపతితో హీరో కార్తికేయ

విభిన్న ప్రేమకథతో తెరకెక్కిన 'ఆర్​ఎక్స్ 100'.. కుర్రకారును తెగ ఆకట్టుకుంది. ఇందులో 'పిల్లా రా' చాలా కాలం శ్రోతల మనసుల్లో మార్మోగింది. ఇదే సినిమాతో పరిచయమైన నటి పాయల్​ రాజ్​పుత్.. యువకుల మనసుల్లో కలలరాణిగా స్థానం సంపాదించుకుంది.

'RX 100' COMPLETES TWO YEARS
ఆర్ఎక్స్ 100 పోస్టర్

కార్తికేయ ప్రస్తుతం 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.