ETV Bharat / sitara

RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. సరికొత్త రికార్డు - rrr release date

అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఆరు రోజుల్లో 100 మిలియన్​ వ్యూస్​ సొంతం చేసుకున్న ప్రచార చిత్రంగా నిలిచింది.

RRR trailer
ఆర్ఆర్ఆర్ ట్రైలర్
author img

By

Published : Dec 15, 2021, 3:00 PM IST

Updated : Dec 15, 2021, 3:21 PM IST

RRR movie: 'ఆర్ఆర్ఆర్'.. థియేటర్లలోకి రావడానికి ఇంకా చాలా రోజులు టైముంది. కానీ ఆ సినిమా ట్రైలర్ మాత్రం యూట్యూబ్​లో రికార్డులు సెట్​ చేస్తూ దూసుకెళ్తుంది. డిసెంబరు 9న ఆ ట్రైలర్​ విడుదలవగా.. ప్రస్తుతం అది అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్​ వ్యూస్​ సాధించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.

RRR trailer cross 100 million views
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్

అలానే ఈ సినిమాతో తొలి పాన్ ఇండియా చిత్రం చేసిన ఎన్టీఆర్.. సొంతంగా హిందీలో డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ విషయాన్ని బుధవారం ఓ ఫొటో పోస్ట్ చేసి వెల్లడించారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.

RRR NTR HINDI DUBBING
హిందీ డబ్బింగ్​లో ఎన్టీఆర్

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్​ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో జనవరి 7న థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2021, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.