RRR movie sankranthi: 'ఆర్ఆర్ఆర్' టీమ్.. అభిమానులకు సంక్రాంతి, భోగి పండగ శుభాకాంక్షలు చెప్పింది. కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తామని తెలిపింది.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకుడు.
Karthi viruman First look: కార్తి హీరోగా నటిస్తున్న 'విరుమన్' సినిమా ఫస్ట్‌లుక్.. శుక్రవారం రిలీజైంది. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సూర్య.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
*శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'భళా తందనాన'. ఇందులోని 'మీనాచ్చి మీనాచ్చి' అంటూ సాగే గీతం.. శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్గా చేస్తోంది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. 'హీరో' సినిమాలోని 'బుర్ర పాడవుతాందే' పూర్తి వీడియో సాంగ్‌ను భోగి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*అలానే భోగి పండగను పురస్కరించుకుని 'కర్ణ', 'బెస్ట్ కపుల్', 'కొత్త కొత్తగా' సినిమాల టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ త్వరలో థియేటర్లలోకి రానున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: