RRR movie Day 1 Collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్ఆర్ఆర్'.. తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. జక్కన్న గత చిత్రం 'బాహుబలి' రికార్డులను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో సుమారు 11 వేల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 257 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.120 కోట్ల 19 లక్షలు వసూలు చేయగా.. 74 కోట్ల 11 లక్షల షేర్ వచ్చింది. కర్ణాటకలో రూ. 16 కోట్ల 48 లక్షలు, తమిళనాడులో రూ. 12 కోట్ల 73 లక్షలు, కేరళలో రూ. 4 కోట్ల 36 లక్షలు సాధించగా.. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు రెస్టాఫ్ ఇండియా కలిపి 25 కోట్ల 14 లక్షల రూపాయలు ఆర్ఆర్ఆర్ తొలిరోజు వసూళ్లు ఉన్నాయి.
ఓవర్సీస్లో రూ. 78 కోట్ల 25 లక్షల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 43 కోట్ల షేర్ సాధించిన బాహుబలి 2 రికార్డు నెలకొల్పగా.. ఆర్ఆర్ఆర్ ఆ మొత్తాన్ని అధిగమించి 74 కోట్ల 11 లక్షలతో రికార్డు నమోదు చేసింది. కాగా, రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
ఇదీ చూడండి: కుంభస్థలం బద్దలుకొట్టిన 'ఆర్ఆర్ఆర్'.. తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైం రికార్డు