తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతించిన క్రమంలో 'ఆర్ఆర్ఆర్' కోసం రాజమౌళి ట్రయల్ షూట్‌కు సిద్ధమయ్యారని సమాచారం. రెండు రోజులపాటు గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ట్రయల్ షూట్ జరగబోతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ షూట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొనడం లేదని తెలుస్తోంది. వారి స్థానంలో డూప్లతో చిత్రీకరణ చేయాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశారట. ట్రయల్ షూట్ విజయవంతమైన తర్వాత హీరోలతో షూటింగ్‌ను కొనసాగించాలని యోచిస్తున్నారట. దీని కోసం 50 మంది సిబ్బందిని నియమించనున్నారట. ట్రయల్ షూట్ సమయంలో ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని చిత్రబృందం నిర్ణయించిందట.
ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 'బాహుబలి' విజయం తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇదీ చూడండి... పెళ్లికి ముందే శుభవార్త చెప్పేశారు!