దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR movie) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది(ntr ram charan rrr movie). ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించి ఓ బిగ్ సర్ప్రైజ్ను అక్టోబర్ 29న ఇవ్వనున్నట్లు ఇటీవలే తెలిపింది చిత్రబృందం. అయితే అది ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడా బిగ్ సర్ప్రైజ్ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
'ఆర్ఆర్ఆర్'ను(RRR movie) ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజ్ చేసేందుకు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న టీమ్‌తో చర్చలు కూడా జరిపిందట. ఈ డీల్ ఓకే అయినట్లు సమాచారం. ఈ విషయాన్నే అక్టోబర్ 29న అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి: ఆ రోజున 'ఆర్ఆర్ఆర్' నుంచి బిగ్ సర్ప్రైజ్