ETV Bharat / sitara

Shilpa Shetty: ఆ ఐదుసార్లు శిల్పాశెట్టి వివాదాల్లో.. - రాజ్​కుంద్రా పోర్న్​ కేసు

రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన అందం, నటనతో కొనసాగుతున్న శిల్పాశెట్టి.. ప్రస్తుతం తన భర్త, అశ్లీల​ చిత్రాల కేసులో విచారణ ఎదుర్కొంటూ వార్తల్లో నిలిచింది. అయితే ఈ ముద్దుగుమ్మకు వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలుసార్లు ఇలానే వార్తల్లో నిలిచింది.

shilpa shetty
శిల్పాశెట్టి
author img

By

Published : Jul 29, 2021, 11:42 AM IST

శిల్పాశెట్టి.. ఈ పేరు ప్రస్తుతం వార్తల్లో హాట్​టాపిక్​! ఈమె భర్త రాజ్​కుంద్రా అశ్లీల చిత్రాల దందా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లడమే ఇందుకు కారణం. ఈ వ్యాపారంలో ఆమె హస్తం కూడా ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో తనకేమీ సంబంధంలేదని శిల్పా వివరణ​ కూడా ఇచ్చింది. అయితే ఒకప్పుడు తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ఇలా వివాదాల్లో నిలవడం కొత్తేమి కాదు. ఇంతకీ అవేంటంటే?

అక్షయ్​కుమార్​తో బ్రేక​ప్​

శిల్పాశెట్టి.. అక్షయ్​కుమార్​తో 1992లో 'ఖిలాడీ' సినిమాలో నటించింది. ఈ చిత్ర షూటింగ్​ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని తెగ వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రేమ ఎక్కువ కాలం సాగలేదు! గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఈ విషయాన్ని బయటపెట్టింది. అక్షయ్​ తనను మోసం చేశాడని ఆరోపించింది.

shilpa shetty
అక్షయ్​-శిల్పాశెట్టి

రిచార్డ్​ గెరెతో ముద్దు

2007లో ఎయిడ్స్​పై ప్రచారంలో భాగంగా భారత్​ వచ్చిన హాలీవుడ్​ నటుడు రిచర్డ్​ గెరె.. శిల్పాశెట్టిని ముద్దుపెట్టుకున్నాడు. బహిరంగంగా అలా ముద్దాడడంపై అప్పట్లో తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. పలు ప్రజా సంఘాలు, పార్టీలు శిల్పాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాయి. వారిద్దరిని అరెస్ట్​ చేయాలని రాజస్థాన్​ కోర్టు వారంట్​ కూడా జారీ చేసింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపారేసింది. ఆ విషయంపై ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

shilpa shetty
రిచార్డ్​ గెరెతో ముద్దు

జాతివివక్ష వ్యాఖ్య

2002 ఇంగ్లాండ్​లో 'సెలబ్రిటీ బిగ్​ బ్రదర్'​ రియాలిటీ షోలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది శిల్పా. ఆ షోలో గెలుపొంది భారీ మొత్తంలో నగదు బహుమతిని అందుకుంది. అయితే ఈ కార్యక్రమంలో శిల్పాపై తన హౌస్​మేట్స్​ జేడ్​ గుడీ, డేనియల్​ లాయిడ్​ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఏదేమైనప్పటికీ ఆ ఎపిసోడ్​లో ప్రపంచం మొత్తం ఆమెకు అండగా నిలిచింది. ఈ షోలో 63 శాతం ఓట్లతో విజయం సాధించి, విశేష ప్రాచుర్యాన్ని సంపాదించింది.

shilpa shetty
శిల్పాశెట్టి

తప్పేముంది?

2006లో శిల్పాశెట్టి, రీమాసేన్​లకు మధురై కోర్టు నాన్​ బెయిలబుల్​ వారెంట్లు జారీ చేసింది. ఓ తమిళ దినపత్రిక కోసం వారు అసభ్యకరంగా పోజులిచ్చారు. ​దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత దీని గురించి శిల్పా మాట్లాడుతూ.. "ఇందులో అశ్లీలత ఏముంది? ఒకవేళ నాభి చూపించడంలో అశ్లీలత ఉందంటే, దేశ సంప్రదాయమైన చీరను మొదటగా బ్యాన్​ చేయాలి" అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు అపట్లో దూమారం చెలరేగాయి.

shilpa shetty
శిల్పాశెట్టి

శిల్పాశెట్టి.. తొలి తెలుగు చిత్రం 'సాహ‌స‌వీ‌రుడు సాగ‌ర‌క‌న్య'తో ప్రేక్ష‌కుల మనసుల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత బీటౌన్​లో స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవు‌డ్‌లో నిర్మా‌తగా, టీవీ షోలకు వ్యాఖ్యా‌తగా వ్యవ‌హ‌రిస్తూ బిజీ‌ బి‌జీగా ఉంది. తల్లి అయినప్పటికీ ఆమె అందంలో ఏ మాత్రం మార్పు‌లేదు. నవ‌తరం కథానాయికలకు సైతం పోటీ‌ని‌చ్చేలా ఆమె తన అందాన్ని ఇంకా కాపాడు‌కోవడం విశేషం.

shilpa shetty
శిల్పాశెట్టి

ఇదీ చూడండి: RajKundra news: కుంద్రా కేసులో 'శిల్పాశెట్టి' పాత్ర ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.