లాక్డౌన్లో వరుసగా సినిమాలు తీస్తున్న దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. తాజాగా మరో సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. తెలంగాణలో గతేడాది జరిగిన ఓ పరువు హత్య ఆధారంగా 'మర్డర్' చిత్రం తీసినట్లు వర్మ వెల్లడించారు.
పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరేగతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వారి మనస్తత్వాలను కనగలమా? మీరే చెప్పండి అంటూ వీక్షకులకు ప్రశ్నల సంధించారు ఆర్జీవీ. త్వరలో ఈ సినిమా ఏటీటీ వేదికగా విడుదల కానుంది. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా, నట్టి కరుణ-నట్టి క్రాంతి సంయుక్తంగా నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">