ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2'​ నుంచి రవీనా టాండన్ లుక్ రిలీజ్ - రవీనా టాండన్ పుట్టినరోజు

యశ్​ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేడు (సోమవారం) రవీనా పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Raveena Tandon's character look from KGF 2 out on her birthday
'కేజీఎఫ్ 2'​ నుంచి రవీనా టాండన్ లుక్
author img

By

Published : Oct 26, 2020, 1:32 PM IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'కేజీఎఫ్'. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈరోజు రవీనా పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్​లో ఆమె ఎర్ర చీర కట్టుకుని పార్లమెంట్​లో కూర్చుని ఉంది. దీనిని బట్టి చూస్తే రవీనా ఈ చిత్రంలో రమికా సేన్ అనే రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.