"ఆనందం.. డబ్బు.. జ్ఞానం.. ఈ మూడు అందివ్వని ఏ పని కోసం మీ సమయాన్ని వృథా చేసుకోకండి" అని నటి రష్మిక అంటోంది. కొవిడ్ పరిస్థితుల వల్ల చిత్రీకరణలు లేక ఇంటికే పరిమితమైన ఈమె.. ట్విటర్ వేదికగా అభిమానులకు జీవిత సత్యాలు బోధిస్తోంది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ చెప్పిన ఓ మంచి మాటను నెటిజన్లతో పంచుకుంది.
"సమయం చాలా విలువైనది. దాన్ని మీకు ఆనందం కలిగించే పని కోసం వాడంది. లేదంటే డబ్బు, జ్ఞానం అందిచ్చే వాటిపైనైనా వెచ్చించండి. మీకు ఏరకంగానూ సంతృప్తి ఇవ్వని వాటి కోసం మాత్రం వృథా చేయకండి" అని చెప్పింది. రష్మిక తెలుగులో 'పుష్ప', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై' సినిమాలు చేస్తోంది.

ఇవీ చదవండి: