మిహీకా బజాజ్‌కు ప్రపోజ్ చేయడం, ఆమె గురించి ఇంట్లో చెప్పడం.. అంతా చాలా సింపుల్‌గా జరిగిపోయిందని కథానాయకుడు రానా చెప్పారు. 'లాక్డ్ అప్ విత్ లక్ష్మి' పేరుతో కొన్ని రోజులుగా మంచు లక్ష్మి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రానాతో మాట్లాడారు. మిహీక, లాక్‌డౌన్‌లో కాలక్షేపం గురించి ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య సంభాషణను మీకోసం.
మంచు లక్ష్మి: నువ్వు మిహీకను ప్రేమిస్తున్నట్లు చెప్పినప్పుడు.. నేను ఐదు నిమిషాలు షాక్‌లో ఉన్నా. ఒక్క నిమిషంలో నీ ప్రేమ కథ చెప్పావు. తట్టుకోలేకపోయా (నవ్వుతూ).. వెంటనే ఇంటికి వెళ్లి ప్రకాశ్‌కు చెప్పా. కొకొకోలా బాటిల్ ఓపెన్ చేసే లోపు నీ ప్రేమ కథ చెప్పేశావు. కనీసం డ్రింక్ గ్లాసులో పోసే సమయం కూడా లేదు. మిహీక నీకు సరైన వ్యక్తని ఎలా అనిపించింది?
రానా: మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు.. మనకు ఏం కావాలో, ఎవరు కావాలో తెలుస్తుంది. సరైన వ్యక్తిని కలిసినప్పుడు ప్రేమ పుడుతుంది. ఆమెను చూసినప్పుడు తనే నా లవ్ అనిపించింది. కొన్నేళ్ల నుంచి తను తెలిసినా.. ఈ మధ్యే ఆ ఫీలింగ్ కలిసింది.
మంచు లక్ష్మి: మీ ఫొటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. నీ పెళ్లంటే నాకు చాలా ఉత్సుకతగా ఉంది. మా రానా పెళ్లి అవుతోందోచ్ అని ఎంతో ఆనందంగా ఉన్నా. లిటిల్ రానా, మిహీక నా కళ్ల ముందు తిరుగుతుంటే చూడాలని ఉంది. నువ్వు ఆమెకు ఎలా ప్రపోజ్ చేశావు?
రానా: ఫోన్ ద్వారా తనకు నేను ప్రేమిస్తున్న విషయం చెప్పా.. తర్వాత తను నన్ను కలిసింది. నేను ఈ విషయం వెల్లడించిన తర్వాత చాలా మంది నుంచి సందేశాలు, కాల్స్ వచ్చాయి. శుభాకాంక్షలు చెప్పారు.
మంచు లక్ష్మి: రానా.. నన్ను ఎందుకు ఇష్టపడలేదు అని ఎవరైనా అన్నారా?
రానా: అలా ఎవరూ మాట్లాడలేదు. అందరూ పాజిటివ్‌గానే విష్ చేశారు.
మంచు లక్ష్మి: నా పెళ్లి సమయంలో కాస్త కంగారు పడ్డా. నీకు అలా ఏమైనా ఉందా?
రానా: పెళ్లి త్వరగా చేసుకునే వ్యక్తికి బహుశా.. భయం, కంగారు ఉంటాయేమో. కానీ నేను ఎదిగాను కాబట్టి అలాంటి ఫీలింగ్స్ లేవు. మిహీకది హైదరాబాద్. నార్త్ ఇండియాలో పెరిగింది. ముంబయిలో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటే.
మంచు లక్ష్మి: "ఆరు నిమిషాల్లో అంతా అయిపోయిందమ్మా" అని మీ అమ్మ నాకు చెప్పారు. ఆ ఆరు నిమిషాలు కూడా.. మూడు రోజులపాటు రెండు, రెండు నిమిషాల్లో చెప్పావట?
రానా: నవ్వుతూ.. అవును. అంతా అలా జరిగిపోయింది. ఎటువంటి సమస్యలు రాలేదు. ఇంట్లో ప్రతి ఒక్కరు నా పెళ్లి కోసం ఎదురుచూశారు. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు.
మంచు లక్ష్మి: సాధారణంగా అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి, ఆమె మనకు సరైన భాగస్వామేనా? అంటూ నిద్ర, తిండి మానేసి ఆలోచిస్తుంటారు కదా. నువ్వు కూడా ఆలోచించావా?
రానా: ఓ రోజంతా ఆలోచించి.. సాయంత్రం ఆమెకు చెప్పా.
మంచు లక్ష్మి: మిహీకకి ఉంగరం తొడిగావా?
రానా: లేదు.. ఇది కేవలం రోకా మాత్రమే.. ఆమె వేలు కూడా ముట్టుకోలేదు (సరదాగా). (వెంటనే మంచు లక్ష్మి అందుకుని.. నా చెవిలో పువ్వులు పెట్టొద్దు. భౌతిక దూరమా?(నవ్వులు)
మంచు లక్ష్మి: లాక్‌డౌన్ ఎలా గడిచింది?
రానా: లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత ఇంట్లో ఏం చేయాలో అర్థం కాలేదు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్.. చూశా. పుస్తకాలు చదివా. సెట్‌కు వెళ్లి, నటించే పరిస్థితి లేదు. కాసేపు టాకింగ్.. కాసేపు యానిమేషన్ చేశా. 'వై ఆర్ యు' అనే ఫన్ షోను రూపొందించా. త్వరలో అది ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల కాబోతోంది.
మంచు లక్ష్మి: లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని అనుకుంటున్నావు?
రానా: ఇకపై అందరూ భౌతిక దూరం పాటించాల్సి వస్తుంది. దగ్గరికి వెళ్లి గ్రీట్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం ఉండవు. పరిస్థితులు మారుతాయి. ఈ లాక్‌డౌన్ ఎంతో నేర్పింది. సమస్య ఏదైనా సరే దానితో పోరాడాల్సిందే కదా.. ఎలాగైనా అధిగమించాలి.