ETV Bharat / sitara

రామ్​గోపాల్ వర్మ కొత్త చిత్రం 'పవర్ స్టార్'

లాక్​డౌన్​లోనూ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. తాజాగా తన కొత్త సినిమా 'పవర్ స్టార్' అంటూ ప్రకటించాడు.

Ram Gopal Varma announce his new movie title Power Star
రామ్ గోపాల్ వర్మ
author img

By

Published : Jun 28, 2020, 5:35 PM IST

Updated : Jun 28, 2020, 6:45 PM IST

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్​గోపాల్‌ వర్మ. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయి, చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన సమయంలోనూ వరుస చిత్రాలు తీస్తూ దూసుకుపోతున్నాడు. 'క్లైమాక్స్‌' అంటూ పోర్న్‌స్టార్‌తో ఓ సినిమా తీసి శ్రేయాస్​ ఏటీటీ వేదికగా దాన్ని విడుదల చేశాడు.

తాజాగా తన తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించాడు వర్మ. 'పవర్‌స్టార్‌' పేరుతో ఓ సినిమా తీయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. "ఇదిగో ఇతనే నా కొత్త చిత్రం 'పవర్‌స్టార్‌'లో స్టార్‌. ఇతను నా ఆఫీస్‌కు వచ్చిన సందర్భంలో తీసిన వీడియో ఇది. ఏ వ్యక్తితోనైనా ఇతనికి పోలికలు ఉంటే అది హఠాత్తుగా, అనుకోకుండా, ఉద్దేశపూర్వకంగా, అప్రయత్నంగా జరిగి ఉండవచ్చు" అంటూ ట్వీట్ చేశాడు.

  • Here is the STAR of my new film POWER STAR ...This shot was taken when he visited my office ..Any resemblance to any other person is incidentally coincidental and intentionally unintentional.. pic.twitter.com/geulQ4YAj8

    — Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం రామ్ గోపాల్‌ వర్మ 'కరోనా వైరస్‌', 'ది మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంధీ', 'కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌' 'మర్డర్‌' అనే చిత్రాలు చేస్తున్నారు. ఇతడు రూపొందించిన 'నేక్​డ్​' చిత్రం త్వరలోనే ఏటీటీ వేదికగా విడుదల కానుంది.

Last Updated : Jun 28, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.