ETV Bharat / sitara

Rakul preet singh birthday: ఆ నటుడితో రిలేషన్​లో రకుల్​ప్రీత్ - రకుల్ ప్రీత్ భాయ్​ఫ్రెండ్

'కొండపొలం' సినిమాతో అభిమానుల్ని అలరిస్తున్న రకుల్​ప్రీత్.. గుడ్​న్యూస్ చెప్పేసింది. ప్రముఖ నటుడితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది.

Rakul Preet Singh
రకుల్​ప్రీత్
author img

By

Published : Oct 10, 2021, 3:44 PM IST

Updated : Oct 10, 2021, 5:00 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్.. రిలేషన్​లో ఉన్నట్లు వెల్లడించింది. ఈమె పుట్టినరోజు(rakul preet singh husband) సందర్భంగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ.. రకుల్​కు బర్త్​డే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టారు. దీనికి ప్రతిగా రకుల్​ కూడా పోస్ట్​ పెట్టి, 'థాంక్యూ మై లవ్' అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చింది. దీనిబటి చూస్తుంటే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తున్నారు.

"నువ్వు లేకుండా రోజులు నిస్సారంగా సాగుతున్నాయి. నువ్వు నా పక్కన లేకపోతే ఎంతో టేస్టీ ఫుడ్​ తిన్నాసరే చాలా నార్మల్​గా ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ సోల్" అని రకుల్​ప్రీత్​తో కలిసున్న ఫొటోను జాకీ, ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

తెలుగు సినిమా 'కెరటం'తో హీరోయిన్​గా పరిచయమైన రకుల్.. తమిళ, హిందీ భాషల్లోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల 'కొండపొలం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం హిందీలో డాక్టర్ జీ, ఎటాక్, మేడే, అయలాన్, థాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, ఇండియన్​ 2 సినిమాలు చేస్తోంది.

బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీ కుమారుడైన జాకీ.. 'రెహనా హై తేరే దిల్​ మే'(2001) సినిమాలో అతిథి పాత్రతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కల్ కిస్​నే దేఖా' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. యంగిస్థాన్, వెల్​కమ్ టూ కరాచీ, ఫాల్తూ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. మరోవైపు నిర్మతగా సర్​బ్​జీత్, బెల్ బాటమ్, కూలీ నం.1, జవానీ జానేమన్ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం టైగర్​ష్రాఫ్​తో గణపత్ పార్ట్ 1, మహావీర్ కర్ణ చిత్రాల్ని రూపొందిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 10, 2021, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.