ETV Bharat / sitara

రజనీ 'పెద్దన్న'.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు..! - latest movie collections

తలైవా రజనీకాంత్.. 'పెద్దన్న' చిత్రంతో తొమ్మిదోసారి వందకోట్ల క్లబ్​లో చేరారు. ఈ మార్క్​ను కేవలం మూడురోజుల్లోనే చేరుకుందట.

Rajinikanth's Annaatthe
రజనీకాంత్ అన్నాత్తే మూవీ
author img

By

Published : Nov 8, 2021, 5:00 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. అన్నాత్తే(తెలుగులో 'పెద్దన్న') అంటూ థియేటర్లలో అలరిస్తున్నారు. దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు ఒకరు వెల్లడించారు.

ఈ సినిమాలో రజనీ.. గ్రామపెద్దగా నటించారు. ఆయన సోదరిగా కీర్తి సురేశ్​ కనిపించింది. ఖుష్బూ, మీనా కీలక పాత్రలు పోషించగా, నయనతార కథానాయికగా నటించింది. శివ దర్శకత్వం వహించగా, సన్​ పిక్చర్స్ నిర్మించింది.

అన్నాత్తే(తెలుగులో 'పెద్దన్న')తో కలిపి.. రజనీకాంత్ తొమ్మిది సినిమాలు ఇప్పటివరకు రూ.100 కోట్ల క్లబ్​లో చేరాయి.

దాదాపు 46 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకుగానూ రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఇటీవల దిల్లీలో ఆ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.

Rajinikanth's Annaatthe
రజనీకాంత్ 'పెద్దన్న' మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.