ETV Bharat / sitara

'వదంతులు నమ్మకండి.. రజనీ ఆరోగ్యం బాగానే ఉంది' - rajnikanth health clarifies

అగ్ర కథానాయకుడు రజనీకాంత్​ ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల గురించి స్పందించారు ఆయన ప్రతినిధులు. తలైవా ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు.

rajni
రజనీ
author img

By

Published : Nov 22, 2020, 6:46 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​.. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, చికిత్స కూడా తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన ఆయన ప్రతినిధులు.. తలైవా ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. 'రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవం. ఆయన పోయెస్ గార్డెన్‌లోని నివాసంలోనే ఉన్నారు' అని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.

మరోవైపు తమిళ నటుడు తలవసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనకు క్యాన్సర్‌ సోకిందని, సాయం చేయమని ఆయన వేడుకుంటున్న వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న రజనీ స్వయంగా తలవసికి ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి, ఆర్థిక సాయం అందించారు. త్వరలోనే కోలుకుంటావంటూ ఆయనలో ధైర్యం నింపారు.

ఇదీ చూడండి :

రోడ్లపై రజనీ మారువేషాలు.. ఎందుకంటే?

అతడికి రజనీ ఫోన్​ కాల్​.. ఏమి మాట్లాడారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.