మన దేశానికి ప్రధానిగా చేసిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు బయోపిక్ సిరీస్కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. 'ఆహా'స్టూడియోస్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. వీరు తీస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
-
Risen from a small town in Telangana to be the Prime Minister of India, his roar rebuilt India | Late PM #PVNarasimhaRao's legendary story, now a Pan India web series directed by National award-winning director @prakashjha27 .#ahaStudio pic.twitter.com/mkg8wPYr9x
— ahavideoIN (@ahavideoIN) December 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Risen from a small town in Telangana to be the Prime Minister of India, his roar rebuilt India | Late PM #PVNarasimhaRao's legendary story, now a Pan India web series directed by National award-winning director @prakashjha27 .#ahaStudio pic.twitter.com/mkg8wPYr9x
— ahavideoIN (@ahavideoIN) December 13, 2021Risen from a small town in Telangana to be the Prime Minister of India, his roar rebuilt India | Late PM #PVNarasimhaRao's legendary story, now a Pan India web series directed by National award-winning director @prakashjha27 .#ahaStudio pic.twitter.com/mkg8wPYr9x
— ahavideoIN (@ahavideoIN) December 13, 2021
ఆయన జీవితంపై రాసిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించనున్నట్లు తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన దర్శకుడు ప్రకాశ్ ఝా.. ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సిరీస్ తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పీవీ నరసింహారావు.. ప్రధాని కాకముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇందిరా గాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత 1991 జూన్ 21న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు.
పీవీ నరసింహారావుకు 17 భాషల్లో ప్రావీణ్యం ఉండటం విశేషం. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా, ఆధునిక చాణక్యుడిగా పేరొందిన ఈయన.. 2004 డిసెంబరు 23న తుదిశ్వాస విడిచారు.
ఇవీ చదవండి: