Puneeth rajkumar amazon prime: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. గతేడాది అక్టోబరు 19న గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఆయన తనువు చాలించడాన్ని అభిమానుల్ని తట్టుకోలేకపోయారు. కొన్నిరోజులపాటు ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయారు. సాధారణ ప్రజలతో పాటు స్టార్ సెలబ్రిటీల వరకు పునీత్‌కు ఘనంగా నివాళి అర్పించారు.
ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది. పునీత్ నటించిన ఐదు సినిమాలను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అభిమానులు, యాప్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అలానే పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న మూడు కొత్త సినిమాలు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'వన్ కట్ టూ కట్', 'ఫ్యామిలీ ప్యాక్' కూడా తమ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
![puneeth rajkumar five movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14251198_puneeth-rajkumar.jpg)
2002లో 'అప్పు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పునీత్. అప్పటి నుంచి ఈ కథానాయకుడిని ఫ్యాన్స్ 'అప్పు' అని పిలవడం ప్రారంభించారు. అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుదుగురు, అంజనీపుత్ర తదితర సినిమాలతో హిట్లు కొట్టి అభిమానుల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు.
పునీత్ ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన 'యువరత్న' సినిమాలో చివరగా కనిపించారు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై ఆదరణ దక్కించుకుంది. నటుడిగానే కాకుండా సింగర్‌గాను అభిమానుల్ని అలరించారు పునీత్. గాయకుడిగా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పునీత్ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
![puneeth rajkumar james movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14251198_james-movie.jpg)
ఇవీ చదవండి:
- Puneeth Rajkumar News: ఆరు నెలల వయసులోనే సినీ అరంగేట్రం!
- నేత్రదానం చేసిన పునీత్.. తండ్రి అడుగుజాడల్లోనే...
- పునీత్‌కు 'పవర్ స్టార్' బిరుదు ఎవరిచ్చారో తెలుసా?
- Puneeth Rajkumar news: టాలీవుడ్‌తో పునీత్‌కు ఎనలేని 'బంధం'
- Puneeth rajkumar news: పునీత్.. హీరోను మించిన గొప్ప మనిషి
- Punith rajkumar death: 10 మంది పునీత్ ఫ్యాన్స్ మృతి, ఒకరు ఆస్పత్రిలో
- పునీత్ చివరి సినిమా.. ఆయన జయంతికి రిలీజ్..!
- హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
- Puneeth Biopic: త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ బయోపిక్!