Nani ShyamSingha Roy movie: "విశ్వజనీనమైన కథతో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంద"న్నారు నిర్మాత వెంకట్ బోయనపల్లి. ఆయన నిర్మించిన ఈ సినిమాలో నాని కథానాయకుడిగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో చిత్ర విశేషాలను తెలిపారు నిర్మాత వెంకట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఈ చిత్రంలో ఓ అద్భుతమైన ప్రేమకథ ఉంది. సినిమా చూస్తే కచ్చితంగా 1970ల కాలం నాటి కోల్‌కతాలోకి వెళ్లినట్లే అనుభూతి చెందుతారు. ఆరోజుల్లో అక్కడి కల్చర్ ఎలా ఉండేదో తెలుస్తుంది. అప్పటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తాం. ఇదొక విశ్వజనీనమైన సినిమా. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు. అందుకే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు హిందీలో విడుదల చేయడం లేదు".
"నానిపై ఉన్న నమ్మకంతోనే బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నేను ఆయన్ని నమ్మాను. ఆయన కథను, దర్శకుడ్ని నమ్మారు. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇందులో ముగ్గురు కథానాయికలు చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్ మేకింగ్ ప్రేక్షకుల్ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"నేను 12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 'కృష్ణార్జున యుద్ధం' సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాను. ఆ చిత్ర సమయంలోనే సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించాలని అనుకున్నా. తొలి సినిమా నానితోనే చేయాలని రెండున్నరేళ్లు ఎదురు చూశా. ఇప్పుడీ దీంతో నా కోరిక నెరవేరింది. అందుకే ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నానికి 'జెర్సీ'లా.. నాకు ఈ 'శ్యామ్ సింగరాయ్' గుర్తుండిపోతుంది. సినిమా చూసి అందరూ బాగుంటుందంటారని నమ్మకంగా ఉంది".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: డిసెం'బరి'.. ముగింపులో మెరుపులే!