ఎన్నాళ్లో నుంచో వస్తున్న తన రెండో పెళ్లి వార్తలపై స్పందించారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు.
"ప్రస్తుత పరిస్థితులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వృత్తిపరంగా అంత త్వరగా కోలుకోలేం. వ్యక్తిగతంగానూ నాకు కొన్ని రోజుల నుంచి టైమ్ బాగోలేదు. అంతా త్వరలో సర్దుకుంటుందని భావిస్తున్నా. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. దానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నా" -దిల్‌రాజు ప్రకటన
తన స్వస్థలమైన నిజామాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు రాత్రి 11 గంటలకు దిల్‌రాజు వివాహం జరగనుంది. కేవలం 10 మంది బంధువులు మాత్రమే హాజరు కానున్నారు.
దిల్‌రాజు మొదటి భార్య అనిత(46).. 2017లో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈయన పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్', నాని-సుధీర్‌బాబుల మల్టీస్టార్ 'వి' సినిమాలు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.