ETV Bharat / sitara

Priyanka chopra: 'ఆ భయంతో విమానంలోనే ఏడ్చేశా' - Priyanka chopra citadel release date

గతేడాది కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఇంటికి పరిమితమైన ప్రియాంకా చోప్రా.. లాక్​డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం తిరిగి షూటింగ్​లకు హాజరయ్యేందుకు తీవ్రంగా భయపడినట్లు పేర్కొంది. ఆ సమయంలో తన భర్త నిక్ జోనాస్ అందించిన మద్దతుతోనే తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు పేర్కొంది.

Priyanka chopra
Priyanka chopra
author img

By

Published : Aug 31, 2021, 8:02 PM IST

ప్రియాంకా చోప్రా(Priyanka chopra).. బాలీవుడ్, హాలీవుడ్​లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. వ్యాపారవేత్తగా, హీరోయిన్​గా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే ఆమె.. ఏడాదిలో ఎక్కువశాతం తన కుటుంబానికి దూరంగానే గడుపుతుంటుంది. కానీ లాక్​డౌన్(coronavirus lockdown) కారణంగా చాలా వరకు ఇంటికే పరిమితమైందీ నటి. అయితే తిరిగి పని మొదలుపెట్టే విషయంలో చాలా భయపడినట్లు ఆమె పేర్కొంది. ఈ మేరకు ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సంఘర్షణను 'వోగ్ ఇండియా' మేగజైన్​(Vogue India magazine)కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Priyanka chopra
ప్రియాంక చోప్రా దంపతులు

"కరోనా సమయంలో దాదాపు ఆరు నెలలపాటు ఇంట్లో నా కుటుంబంతో సురక్షితంగా ఉన్నా. అనంతరం జర్మనీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చాలా భయపడ్డా. విమానంలో ఏడ్చేశా. ఆ సమయంలో నా భర్త నిక్ నాకు అండగా నిలిచాడు. తనతో పాటు.. నా కుటుంబం నాతో జర్మనీ వచ్చింది. నేను షూటింగ్​లో ఉన్నప్పుడు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకొన్నాం. ఒంటరిగా ఉన్న భావన లేకుండా నేను కాస్త కుదుటపడేందుకు నిక్ సహాయం చేయాలనుకున్నాడు."

-ప్రియాంకా చోప్రా, నటి

ప్రియాంకా చోప్రా ప్రస్తుతం 'సిటాడెల్'(citadel) అనే వెబ్​సిరీస్​లో నటిస్తోంది. త్వరలోనే 'ది మ్యాట్రిక్స్' 4(The matrix 4)లో నటించనుంది. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించబోయే బాలీవుడ్ చిత్రం 'జీ లే జరా'(Jee Le Zaraa) చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ మూవీలో ప్రియాంకతో పాటు కత్రినా కైఫ్, ఆలియా భట్ ప్రధానపాత్రలు పోషించనున్నారు.

Priyanka chopra
ప్రియాంక చోప్రా దంపతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.