బాలీవుడ్, హాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్(priyanka chopra removed jonas name) విడిపోతున్నారా? ప్రస్తుతం నెటిజన్ల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. ప్రియాంకా చోప్రా తన ఇన్స్టా ప్రొఫైల్ నేమ్ నుంచి భర్త నిక్ జోనస్ పేరు తొలగించడమే ఇందుకు కారణం. ట్విట్టర్లోనూ చోప్రా, జోనస్ పేర్లను తొలగించి ప్రియాంక మాత్రమే ఉంచింది. దీంతో ఆమె అభిమానులు, ఫాలోవర్స్ షాక్కు గురౌతున్నారు.
ఇటీవలే టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు(chaysam divorce). అయితే ఈ ప్రకటన ముందు సామ్ కూడా తన సోషల్మీడియా ఖాతాల నుంచి అక్కినేని పేరును తొలగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక కూడా తన సామాజిక మాధ్యమాల ఖాతాల పేర్లను మార్చడం వల్ల ప్రియాంక-నిక్ మధ్య కూడా బంధం చెడిందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వారిద్దరూ స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.
స్పందించిన ప్రియాంక తల్లి
అయితే ఈ విషయంపై ప్రియాంక తల్లి మధు స్పందించారు. ప్రియాంక-జోనస్ విడిపోనున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: నెట్టింట ప్రియాంక హాట్ ఫొటో.. షాకైన సోదరి పరిణీతి