ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​' బ్యానర్​లో ప్రభాస్​ కొత్త సినిమా! - ప్రభాస్​కు భారీగా అడ్వాన్స్​ ఇచ్చిన దానయ్య

Prabhas new movie advance: హీరో ప్రభాస్ మరో చిత్రానికి ఓకే చెప్పినట్లు టాలీవుడ్​ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ సినిమాను 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

prabhas
ప్రభాస్​
author img

By

Published : Jan 24, 2022, 4:09 PM IST

Prabhas new movie advance: రెబల్​స్టార్​ ప్రభాస్​ వరుస పాన్​ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మరో భారీ బడ్జెట్​ సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్​ఆర్​ఆర్​ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ప్రభాస్​ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సినీవర్గాల సమాచారం.

ఇప్పటికే సినిమా గురించి చర్చలు కూడా జరిగాయని, ప్రభాస్​ అగ్రీమెంట్​పై సంతకం కూడా చేసేశారని తెలిసింది. ఇందులో భాగంగానే.. నిర్మాత దానయ్య సుమారు రూ. 50కోట్లను అడ్వాన్స్​గా డార్లింగ్​కు ఇచ్చారట!

ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్​ మారుతి ఓ హారర్‌ కామెడీ చిత్రాన్ని తీయనున్నారని.. దానికి 'రాజా డీలక్స్‌' టైటిల్​ కూడా ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ఈ మూవీనే డీవీవీ దానయ్య నిర్మించే అవకాశం ఉందని అంతా మాట్లాడుకుంటున్నారు.

కేవలం ప్రభాస్​తో మాత్రమే కాకుండా మరికొంత మంది టాలీవుడ్​ అగ్రహీరోలతో కూడా సినిమా చేసేందుకు దానయ్య సిద్ధమయ్యారని తెలిసింది. వారికి ఇదే స్థాయిలో అడ్వాన్స్​ ఇవ్వబోతున్నారని తెలిసింది. తాను నిర్మించిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రం నుంచి వచ్చే లాభాలతో హీరోలకు అడ్వాన్స్​లు ఇచ్చి.. వారి డేట్స్​ను బుక్​ చేసుకోవాలని చూస్తున్నారట.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

సౌత్ హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ భామ కంగన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.