ETV Bharat / sitara

''బీస్ట్' కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' - పూజా హెగ్డే లేటెస్ట్ న్యూస్

'బీస్ట్​' చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని కథానాయిక పూజా హెగ్డే(pooja hegde movies) తెలిపింది. తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. ఈ చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత కోలీవుడ్​లో కథానాయికగా అడుగుపెడుతోంది పూజ.

Pooja Hegde
పూజా హెగ్డే
author img

By

Published : Nov 12, 2021, 8:21 AM IST

దక్షిణాదిలో దూసుకుపోతున్న కథా నాయికల్లో పూజా హెగ్డే(pooja hegde movies) ఒకరు. ఆమె చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న తమిళ చిత్రం 'బీస్ట్‌'. అగ్ర కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న చిత్రమిది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం చెన్నైలో పూజపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని పూజ ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. పూజ మాట్లాడుతూ "తమిళ ప్రేక్షకులు 'బీస్ట్‌' కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. నేనూ అంతే ఆత్రుతగా ఉన్నాను. అందుకే వాళ్లకు మంచి సినిమా ఇవ్వాలని మా చిత్రబృందమంతా చాలా కష్టపడుతోంది" అని చెప్పింది. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం జార్జియా వెళ్లనుంది చిత్రబృందం.

జార్జియాలో కశ్మీర్‌

'బీస్ట్‌' చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఎక్కువభాగం జార్జియాలోనే చిత్రీకరణ చేయనున్నారు. ఇందులో భాగంగానే జార్జియాలోనే కశ్మీర్‌ను తలపించేలా సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. భారత్‌ పాక్‌ సరిహద్దుల్లో విజయ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. భారత సరిహద్దుల్లో పనిచేసే ఆర్మీ అధికారిగా విజయ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: నటుడిగా నా లక్ష్యం అదే: దుల్కర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.