పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan Kalyan).. వరుస సినిమాల అప్డేట్స్తో అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేస్తున్నారు. ఆయన కొత్త చిత్రాల పాటలు, టీజర్లు ఇప్పటికే అలరిస్తుండగా, హరీశ్ శంకర్(harish shankar pawan kalyan) దర్శకత్వం వహించే సినిమా అప్డేట్కు టైమ్ ఫిక్స్ అయింది. గురువారం ఉదయం 9:45 గంటలకు దీనిని వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
అయితే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రం కోసం పవన్ దాదాపు రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
ఇటీవల సమావేశమైన చిత్రబృందం.. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు కూడా తెలిపింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. గతంలో పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్'(gabbar singh) బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి, అభిమానుల్ని తెగ అలరించింది.
ఇవీ చదవండి: