పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 'పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్' ద్వారా ఈ సాయాన్ని విడుదల చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది జనసేన పార్టీ.
-
కిన్నెర కళాకారుడు శ్రీ మొగులయ్య గారికి శ్రీ @PawanKalyan గారు రూ.2 లక్షల ఆర్థిక సాయం pic.twitter.com/B6X9dLdDae
— JanaSena Party (@JanaSenaParty) September 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కిన్నెర కళాకారుడు శ్రీ మొగులయ్య గారికి శ్రీ @PawanKalyan గారు రూ.2 లక్షల ఆర్థిక సాయం pic.twitter.com/B6X9dLdDae
— JanaSena Party (@JanaSenaParty) September 4, 2021కిన్నెర కళాకారుడు శ్రీ మొగులయ్య గారికి శ్రీ @PawanKalyan గారు రూ.2 లక్షల ఆర్థిక సాయం pic.twitter.com/B6X9dLdDae
— JanaSena Party (@JanaSenaParty) September 4, 2021
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగులయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. ఈ గుర్తింపుతో మొగులయ్య మనసైతే సంతసించింది కానీ.. కడుపు నిండలేదు. కళాకారుల పింఛను కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయారీ కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన తన ఆర్థిక స్తోమత గురించి ప్రస్తావించారు. దీంతో ముందుకొచ్చిన పవన్.. మొగిలయ్యకు రూ.2 లక్షల సాయం అందించారు.
ఇవీ చూడండి
ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడు