12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేస్తున్న అరుదైన జానపద కళాకారుడు మొగులయ్యకు(mogalaiah pawan) హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్(pawan kalyan age). రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు మొగులయ్యకు చెక్కును అందజేశారు.

ఇటీవలే మొగులయ్య 'భీమ్లా నాయక్'(bheemla nayak) చిత్రంలోని పరిచయ గీతానికి సాకీ ఆలపించడం సహా... ఆ పాటకు తన కిన్నెర స్వరాల్ని అద్దారు. దీనికి చక్కటి స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్యకు పవన్ తన ట్రస్ట్ 'పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్' నుంచి రూ.2 లక్షలు అందించారు.
ఇవీ చదవండి: