ETV Bharat / sitara

'విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు' - ఆయేజా ఖాన్ లేటెస్ట్​ న్యూస్​

పాకిస్థాన్​కు చెందిన నటి ఆయేజా ఖాన్​ శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు సోషల్​మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ ఇన్​స్టాలో ఓ పోస్ట్​ పెట్టారు ఆయేజా.

Pakistani actress Ayeza Khan rubbishes rumours saying she died in PIA plane crash
'విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు'
author img

By

Published : May 23, 2020, 9:19 AM IST

పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం జనావాసాల మధ్య కూలిపోవడం వల్ల విమానంలో ఉన్న 99 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్​ అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో పాకిస్థాన్‌ నటి అయేజా ఖాన్‌ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

అంతేకాదు, ఆమె భర్త కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని అయేజా ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిని ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడని అన్నారు.

ఇదీ చూడండి... 'ఆర్ఆర్ఆర్' స్క్రిప్టులో కీలక మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.