ETV Bharat / sitara

మన హీరోలకు విలన్లు.. అదిరే కాంబినేషన్లు! - ప్రభాస్ మనోజ్ బాజ్​పాయ్

సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకు ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. అందుకోసం పర భాషా నటులపై మక్కువ చూపిస్తున్నారు తెలుగు దర్శకనిర్మాతలు. స్టార్ కథానాయకుల సరసన దీటుగా నిలబడేందుకు వారిని ప్రయత్నిస్తున్నారు.

tollywood
టాలీవుడ్
author img

By

Published : Aug 20, 2021, 7:24 AM IST

హీరోకు తగిన జోడీ ఎంత ముఖ్యమో.. సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకు ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్‌ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమ కనబరుస్తుంటారు. హీరోను మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో.. విలన్‌ గురించీ అంతే! ఆ మేజిక్‌ను చూసి ఇతర దర్శకులూ అదే పద్ధతిని అనురిస్తుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బలమైన విలన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే తెలుగు సినిమాల్లో అటు హిందీ, భోజ్‌పురి నటులు మొదలుకొని ఇటు బంగాల్‌కు చెందిన జిషూ సేన్‌ గుప్తా వరకు ఎంతోమంది మన హీరోల్ని ఢీ కొట్టేందుకు వస్తున్నారు.

రామ్‌చరణ్‌ శంకర్‌ సినిమాలో నాయిక ఎవరన్నది ఖరారైంది. ఇక తేలాల్సింది ప్రతినాయకుడే. ప్రభాస్-ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న 'సలార్‌'లో విలనిజం బాధ్యత ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు. చిరంజీవి, బాలకృష్ణలకూ విలన్లు కావాలి. కొన్నాళ్లుగా విలన్‌ ఎంపిక పనిలోనే ఉన్న ఆయా చిత్రబృందాలు ఓ నిర్ణయానికొచ్చాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

బాలకృష్ణ కోసం విజయ్‌ సేతుపతి?

balayya
బాలయ్య, విజయ్ సేతుపతి

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందనున్న ఆ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. చిరంజీవి 'లూసిఫర్‌' రీమేక్‌లో ప్రతినాయకుడిగా ఓ హీరో కనిపిస్తారని తెలిసింది. మలయాళంలో ఆ పాత్రను హిందీ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ చేశారు. మరి ఆయన్నే తెలుగులో రంగంలోకి దించుతారేమో చూడాలి.

బన్నీ విలన్‌తోనే చరణ్‌ ఢీ

ramcharan
రామ్ చరణ్, ఫహాద్ ఫాజిల్

విలన్‌ పాత్రల కోసం కథానాయకుల్నే రంగంలోకి దింపడం కొత్త ట్రెండ్‌. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, ఆర్య తదితరులు ప్రతినాయకులుగా కనిపించి సత్తా చాటుతున్నారు. 'పుష్ప' కోసం మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ రంగంలోకి దిగారు. ఈ వారంలోనే చిత్రీకరణలో పాల్గొనున్నారు. బన్నీని ఢీ కొట్టే ఫహాద్‌ తదుపరి రామ్‌చరణ్‌కూ విలన్‌గా కనిపిస్తారని సమాచారం. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్‌గా ఫహాద్‌ ఎంపికయ్యారని తెలిసింది. శంకర్‌ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ఓ రేంజ్‌లో ఉంటాయి. మరి ఫహాద్‌ను శంకర్‌ ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఫ్యామిలీమేన్‌తో ప్రభాస్‌ ఫైట్‌!

prabhas
ప్రభాస్, మనోజ్

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌' తెరకెక్కిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రభాస్‌ డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా 'ఫ్యామిలీమేన్‌' ఫేమ్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: Dhee 13: ప్రియమణి, పూర్ణ తీన్మార్​​ డ్యాన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.