ETV Bharat / sitara

ఆ పదిలో.. 'ఆస్కార్‌'ఎవరిని వరించేనో?

Oscar 2022: ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సమయం ఆసన్నమైంది. వేడుక కోసం లాస్‌ ఎంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌ చకచకా ముస్తాబవుతోంది. ఈ సారి రేసులో ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం పది పోటీ పడుతున్నాయి. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Oscar awards
ఆస్కార్​
author img

By

Published : Mar 22, 2022, 7:38 AM IST

Updated : Mar 22, 2022, 7:58 AM IST

Oscar 2022: అతిపెద్ద సినీ సంబరం ఆస్కార్‌ చిత్రోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ వేడుకను ఈనెల 27న వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుక కోసం లాస్‌ ఎంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌ చకచకా ముస్తాబవుతోంది. ఈ తరుణంలో ఈసారి ఆస్కార్‌ ప్రతిమను ముద్దాడనున్న చిత్రమేదన్నది అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది. ఈ 94వ ఆస్కార్‌ అవార్డుల రేసులో ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం పది పోటీ పడుతున్నాయి. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌

Oscar
ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌

The Power of The Dog: ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు రేసులో అత్యధిక నామినేషన్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న చిత్రం 'ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌' న్యూజిలాండ్‌కు చెందిన మహిళా దర్శకురాలు జేన్‌ క్యాంపియన్‌ తెరకెక్కించిన చిత్రమిది. 12 విభాగాల్లో నామినేషన్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ రచయత థామస్‌ సావేజ్‌ తన జీవిత అనుభవాల నుంచి రాసిన 'ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌' నవల ఆధారంగా జేన్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. 1920 కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. జార్జ్‌ బర్బ్యాంక్‌, ఫిల్‌ అనే సోదరుల కథే ఈ సినిమా. ఈ ఇద్దరి జీవితంలో తలెత్తిన పరిస్థితులు? వాటిని వారు అధిగమించిన తీరు.. లాంటి విషయాలతో కథనం సాగుతుంది.

డ్యూన్‌..

Oscar
డ్యూన్‌..

Dune: 'ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌' తర్వాత అత్యధిక ఆస్కార్‌ నామినేషన్లు సాధించిన రెండో చిత్రం 'డ్యూన్‌'. డెన్ని విల్లెవ్‌ తెరకెక్కించిన ఈ సినిమా.. పది నామినేషన్లు అందుకొంది. ఫ్రాంక్‌ హెర్బర్ట్‌ రచించిన 'డ్యూన్‌' అనే సైన్స్‌ ఫిక్షనల్‌ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు డెనిస్‌. విశ్వంలోని రెండు వేరు వేరు గ్రహాల మధ్య సాగే కథ ఇది. దీంట్లో పాల్‌ అట్రీడెస్‌ అనే ఓ తెలివైన కుర్రాడు ఉంటాడు. అతను పుట్టుకతోనే అసాధారణమైన ప్రతిభా పాటవాలు కలిగిన వ్యక్తి. పాల్‌ తన కుటుంబంతో పాటు సమస్త మానవాళి మనుగడ కోసం విశ్వంలోని అత్యంత ప్రమాదకరమైన ఎడారి గ్రహానికి ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? ఆ గ్రహంలోని దుష్టశక్తులతో అతనెలా పోరాటం చేశాడు? అన్నది మిగతా కథ. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌ హంగులు, చూపుతిప్పుకోనివ్వని పోరాట ఘట్టాలతో సాగుతుందీ చిత్రం.

బెల్‌ఫాస్ట్‌..

Oscar
బెల్‌ఫాస్ట్‌..

BelFast: ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు కెన్నెత్‌ బ్రనాగ్‌.. తన జీవితంలోని జ్ఞాపకాల్ని కథగా మలిచి తెరకెక్కించిన చిత్రమే 'బెల్‌ఫాస్ట్‌' కైట్రియోనా బాల్ఫే, జుడి డెంచ్‌, జామీ డోర్నన్‌, కోలిన్‌ మోర్గాన్‌, సియారన్‌ హిండ్స్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు చెందిన ఓ కుటుంబ కథగా సాగుతుంది. దీన్ని బడ్డీ అనే ఓ తొమ్మిదేళ్ల బాలుడు దృష్టి కోణం నుంచి ఎంతో అందంగా.. భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు కెన్నెత్‌. ముఖ్యంగా ఇందులోని కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. ఈ సినిమా అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఏడు నామినేషన్లను అందుకొంది.

డోంట్‌ లుక్‌ అప్‌..

Oscar
డోంట్‌ లుక్‌ అప్‌..

Dont look Up: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆడమ్‌ మెక్‌కే తన సొంత కథతో తెరకెక్కించిన చిత్రం 'డోంట్‌ లుక్‌ అప్‌'. ఇదొక విభిన్నమైన బ్లాక్‌ కామెడీ చిత్రం. ఇందులో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్‌ లారెన్స్‌ ఖగోళ శాస్త్రవేత్తలుగా నటించారు. వాళ్లు ఓ తోకచుక్క నేరుగా భూమి వైపు దూసుకొస్తున్నట్లు గుర్తిస్తారు. అది ఆరు నెలల్లో భూమిని ఢీ కొడుతుందని తెలుసుకున్నాక.. ఆ ముప్పును తప్పించేందుకు వాళ్లేం చేశారు? ఈ క్రమంలో వాళ్లకెదురైన సవాళ్లేంటి? అన్నది ఈ చిత్ర కథాంశం. వాతావరణ సంక్షోభం పట్ల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా ఎంత ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాయన్నది ఈ సినిమాలో వ్యంగంగా చూపించారు దర్శకుడు మెక్‌కే. 75మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం.. దాదాపు 791 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించి ఈ సినిమా ప్రస్తుతం ఉత్తమ చిత్రం సహా నాలుగు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది.

లికోరైస్‌ పిజ్జా..

Oscar
లికోరైస్‌ పిజ్జా

Licorice Pizza: ప్రముఖ దర్శకుడు పాల్‌ థామస్‌ ఆండర్‌సన్‌ తెరకెక్కించిన కామెడీ డ్రామా 'లికోరైస్‌ పిజ్జా'. 1973లో కాలిఫోర్నియాలోని ఫెర్నాండో వ్యాలీలో జరిగే కథ ఇది. 25ఏళ్ల అమ్మాయి.. 15ఏళ్ల యువ నటుడు మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమాని రూపొందించారు పాల్‌ థామస్‌. ఇందులో అప్పటి వాస్తవిక పరిస్థితుల్ని.. చారిత్రక విషయాల్ని చాలా గొప్పగా చూపించారాయన. ఈ చిత్రంలో సీన్‌ పెన్‌, టామ్‌ వెయిట్స్‌, బ్రాడ్లీ కూపర్‌, బెన్నీ సఫ్డీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో మూడు నామినేషన్లు దక్కించుకుంది.

'కింగ్‌ రిచర్డ్‌'..

Oscar
'కింగ్‌ రిచర్డ్‌'..

King Richard: విల్‌స్మిత్‌ కథా నాయకుడిగా రీనాల్డో మార్కస్‌ గ్రీన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం 'కింగ్‌ రిచర్డ్‌'. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణులు వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి, కోచ్‌ అయిన రిచర్డ్‌ విలియమ్స్‌ జీవిత కథతో రూపొందింది. వీనస్‌, సెరీనాలను టెన్నిస్‌ క్రీడాకారిణులుగా తయారు చేయడంలో రిచర్డ్‌ ఎలా కృషి చేశారు? అన్నది ఇందులో భావోద్వేగభరితంగా చూపించారు రీనాల్డో. టైటిల్‌ పాత్రలో విల్‌స్మిత్‌ జీవించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడాయన ఈ పాత్రతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డును అందుకోనున్నారని హాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా ఆరు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లు పొందింది.

నైట్‌మెర్‌ అలే..

Oscar
నైట్‌మెర్‌ అలే..

Nightmare Alley: విలియమ్‌ లిండ్సే గ్రేషమ్‌ రచించిన 'నైట్‌మెర్‌ అలే' నవల ఆధారంగా రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. గిల్లెర్మో డెల్‌ టోరో తెరకెక్కించారు. ఇందులో బ్రాడ్‌లీ కూపర్‌ కార్నివాల్‌ వర్కర్‌గా నటించారు. అతడు తన కెరీర్‌ను పెంచుకోవడం కోసం ఎలాంటి సాహసాలకు సిద్ధపడతాడనేదే చిత్ర కథాంశం. బిగి సడలని స్క్రీన్‌ప్లేతో ఉత్కంఠభరితంగా సాగుతుందీ చిత్రం. ఆస్కార్‌ రేసులో నాలుగు విభాగాల్లో నామినేషన్లు అందుకుంది.

డ్రైవ్‌ మై కార్‌

Oscar
డ్రైవ్‌ మై కార్‌

Drive My Car: ఆస్కార్‌ చరిత్రలోనే ఉత్తమ చిత్రంగా నామినేషన్‌ అందుకున్న తొలి జపనీస్‌ సినిమా 'డ్రైవ్‌ మై కార్‌'. హరుకిమురకామి రచించిన 'మెన్‌ వితౌట్‌ ఉమెన్‌' అనే చిన్న కథల పుస్తకం నుంచి స్వీకరించిన కథతో హమాగుచి రీయుస్కే దీన్ని తెరకెక్కించారు. 'హ్యాపీ అవర్‌' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు దర్శకుడు హమాగుచి. ఇప్పుడీ సినిమాతో తొలిసారి ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్నారు. ఇదొక భావోద్వేగభరిత రోడ్‌ జర్నీ చిత్రం. నటుడు, దర్శకుడైన యుసుకే కపు జీవితకథగా సాగుతుంది. నష్టం.. క్షమాపణ.. అనే అంశాలను స్పృశిస్తూ.. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుందీ చిత్రం. ఆస్కార్‌ రేసులో నాలుగు నామినేషన్లు అందుకొంది.

వెస్ట్‌ సైడ్‌ స్టోరీ..

Oscar
వెస్ట్‌ సైడ్‌ స్టోరీ..

West Side Story: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ తెరకెక్కించిన చిత్రమే 'వెస్ట్‌ సైడ్‌ స్టోరీ'. ఇదొక భిన్నమైన మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా. 1957 నాటి స్టేజ్‌ మ్యూజికల్‌ ఆధారంగా దీన్ని రూపొందించారు. న్యూయార్క్‌ సిటీలోని రెండు ముఠాల మధ్య సాగే పోరు నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అలాగే దీంట్లో ఓ అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుంది. ఇప్పుడీ సినిమా ఆస్కార్‌ రేసులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో సహా ఏడు నామినేషన్లను అందుకుంది. ఇప్పటికే రెండు సార్లు ఆస్కార్‌ గెలుచుకున్న స్పీల్‌బెర్గ్‌.. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి ఆ అవార్డును అందుకుంటారేమో చూడాలి.

కొడా..

Oscar
కొడా..

Coda: ఫ్రెంచ్‌ సినిమా 'లా ఫామిల్లె బెలియర్‌'కు రీమేక్‌గా సియాన్‌ హెడర్‌ తెరకెక్కించిన చిత్రం 'కొడా'. ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా. దీంట్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. రూబీ అనే యువతి కథగా ఈ చిత్రం సాగుతుంది. ఆమె కుటుంబంలో తనకి తప్ప మిగతా అందరికీ వినికిడికి సమస్య ఉంటుంది. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకునేందుకు చేపల వేటలో తల్లిదండ్రులకు సాయం చేస్తుంటుంది. మరోవైపు సంగీతంలో రాణించాలన్న తపనతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే బెర్ల్కీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌కు వెళ్లాలనుకుంటుంది. ఇటు తల్లిదండ్రుల్ని వదిలివెళ్లలేక.. అటు సంగీతాన్ని వదులుకోలేక మానసికంగా నలిగిపోతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? తన కలని నిజం చేసుకోవడానికి రూబీ ఏం చేసిందన్నది చిత్ర కథాంశం. మూడు నామినేషన్లు పొందింది.

ఇదీ చదవండి: 'ది కశ్మీర్​ ఫైల్స్​'.. ఆమిర్​ ఖాన్​ ఏమన్నారంటే?

Last Updated : Mar 22, 2022, 7:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.