ETV Bharat / sitara

katrina kaif marriage: పెళ్లికి రండి.. వాటిని మాత్రం తీసుకురాకండి! - కత్రినాకైఫ్ హజ్బెండ్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. తమ పెళ్లికి వచ్చే వారికి కచ్చితమైన నిబంధన ఒకటి పెట్టారట. అతిథులెవరూ వాటిని తీసుకురావొద్దని సూచించారట. ఇంతకీ అదెంటంటే?(katrina kaif marriage)

katrina kaif marriage
కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ మ్యారేజ్
author img

By

Published : Nov 26, 2021, 6:55 AM IST

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ కత్రినాకైఫ్‌, విక్కీకౌశల్‌ మరి కొన్నిరోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు. డిసెంబర్‌ ఆరంభంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇరువురు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.(katrina kaif vicky kaushal marriage)

డిసెంబర్‌ 7 నుంచి 9 వరకూ జరగనున్న వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేదిక కానుందట. తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజును కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట.

katrina kaif Vicky Kaushal
విక్కీ కౌశల్-కత్రినాకైఫ్

అందుకే ఫ్రెండ్స్‌కు మాత్రమే వెడ్డింగ్‌ కార్డులు అందించారట. అంతేకాకుండా, పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం తమకు ఇష్టం లేదని.. అందువల్ల పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని వారు కోరినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ను ఏర్పాటు చేస్తోన్న ఆర్గనైజర్స్‌కు సైతం ఈ విషయంపై రూల్‌ పాస్‌ చేశారట.

మరోవైపు, శుభకార్యం దగ్గరపడుతోన్న తరుణంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ జంట గత కొన్నిరోజుల నుంచి పెళ్లి పనుల్లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారట. పెళ్లి దుస్తులు, ఆభరణాల సెలక్షన్‌, అతిథుల కోసం ఇచ్చే విందు.. ఇలా అన్ని విషయాలు దగ్గరుండి గమనిస్తున్నారని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.