ETV Bharat / sitara

హీరో నితిన్​ పెళ్లికి ముహూర్తం ఖరారు! - హీరో నితిన్​ వివారం

టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్​కు ఇటీవలె నిశ్చితార్థమైంది. తాజాగా కరోనాతో వాయిదా పడ్డ అతడి వివాహం గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. జులైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేటుగా ఏర్పాటు చేయనున్న వేడుకలో ఈ హీరో పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం.

nitin shalini marriage will be held at private place due to corona
హీరో నితిన్​ పెళ్లి భాజా ఆప్పుడేనా?
author img

By

Published : Jun 27, 2020, 7:43 PM IST

టాలీవుడ్​ హీరో నితిన్​ పెళ్లి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఏప్రిల్​ 15న హైదరాబాద్​లోని తన నివాసంలో షాలినితో ఇతడికి నిశ్చితార్థమైంది. అయితే, కరోనా కారణంగా వివాహం వాయిదా పడింది. తాజాగా, జులైలో ప్రైవేటుగా ఏర్పాటు చేయనున్న వేడుకలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారని సమాచారం. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారట.

నితిన్​ది అరేంజ్డ్​ కమ్​ లవ్​ మ్యారేజ్​. నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించడం వల్ల.. తమ కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు.

ప్రస్తుతం నితిన్‌ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'రంగ్‌దే'తో పాటు 'అంధాధున్‌' రీమేక్‌ను పట్టాలెక్కించాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌ అంధుడిగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్‌ ఏలేటితో ఓ చిత్రం చేస్తున్నాడీ కుర్రహీరో. 'చెక్‌' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్‌ పేట' అనే చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో నితిన్​ మూడు విభిన్న పాత్రలు పోషించనున్నాడు.

ఇదీ చూడండి:జయరాజ్​, ఫెనిక్స్: పోలీసుల క్రూరత్వంపై సెలబ్రిటీల ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.