ETV Bharat / sitara

నిధి, అనుపమ జోరు.. భారీగా రెమ్యునరేషన్! - Nidhi Agarwal remuneration

Nidhiagarwal Anupama remuneration: 'హీరో', 'రౌడీబాయ్'​తో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్​, నిధి అగర్వాల్​ రెమ్యునరేషన్ టాలీవుడ్​లో​ ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. వీరిద్దరూ ఈ చిత్రాల కోసం తమ పారితోషికాన్ని బాగా పెంచేశారని తెలిసింది.

Nidhi Agarwal Anupama parameswaran remuneration
రెమ్యునరేషన్​ పెంచేసిన అనుపమ, నిధి అగర్వాల్​
author img

By

Published : Jan 18, 2022, 6:11 PM IST

Nidhiagarwal Anupama remuneration: సంక్రాంతి సీజన్​లో ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద పోటీ పడ్డాయి. అయితే అందులో 'బంగార్రాజు' తర్వాత ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చిత్రాలు 'హీరో', 'రౌడీబాయ్స్​'.

ఈ రెండు మూవీస్​తో ఇద్దరు కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. సూపర్​స్టార్​ మహేశ్​బాబు మేనల్లుడిగా అశోక్​గల్లా హీరోగా వెండితెర అరంగేట్రం చేయగా.. ప్రముఖ నిర్మాత దిల్​రాజు సోదరుడు శిరీష్​ తనయుడు ఆశిష్​ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఈ రెండు చిత్రాలకు హీరోయిన్లుగా నటించిన నిధిఅగర్వాల్(హీరో)​, అనుపమ పరమేశ్వరన్​(రౌడీబాయ్స్​) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి సన్నివేశాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మల రెమ్యునరేషన్​ గురించి నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరు ఈ చిత్రాల కోసం తమ పారితోషికాన్ని భారీగా పెంచేశారట.

సాధారణంగా అనుపమ ఓ సినిమా కోసం రూ.50లక్షల కన్నా తక్కువే తీసుకుంటుందట! అయితే రౌడీబాయ్స్​ కోసం ఈ సారి రూ.50లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. ఒక్కో చిత్రానికి రూ.50 నుంచి రూ.80లక్షల వరకు అందుకునే నిధిఅగర్వాల్​ హీరో కోసం కోటిన్నర తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాలు విజయం సాధించడం వల్ల వీరిద్దరికి కొత్త మూవీ ఆఫర్లు కూడా వచ్చినట్లు తెలిసింది.

కాగా, అనుపమ.. ప్రస్తుతం '18పేజీస్'​, 'కార్తికేయ 2', 'హెలెన్'​ చిత్రాల్లో నటిస్తుండగా.. నిధి అగర్వాల్​.. 'హరిహర వీరమల్లు'తో పాటు మరో చిత్రం చేస్తోంది.

ఇదీ చూడండి: 'ఆ పాట షూటింగ్ సమయంలో మా బైక్ లోయలోకి దూసుకెళ్లింది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.