ETV Bharat / sitara

అంతా ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నా: నిధి అగర్వాల్ - నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్ మూవీ

Nidhi agarwal hero movie:'హీరో' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నిధి అగర్వాల్.. చిత్ర విశేషాలతో పాటు తను చేస్తున్న కొత్త సినిమాల గురించి వెల్లడించింది.

Nidhi agarwal
నిధి అగర్వాల్
author img

By

Published : Jan 12, 2022, 6:57 AM IST

Nidhi agarwal interview: అందాల నిధిలానే కనిపిస్తుంటుంది నిధి అగర్వాల్‌. ఇస్మార్ట్‌ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ఈమె.. పవన్‌కల్యాణ్‌తో కలిసి నటిస్తోంది. ఇటీవల కొత్త కథానాయకుడు అశోక్‌ గల్లాతో కలిసి 'హీరో'లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిధి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...

* ఈ చిత్రంలో నేనొక వైద్యురాలిగా కనిపిస్తా. పాత్ర పేరు సుబ్బు. 'ఇస్మార్ట్‌ శంకర్‌' తర్వాత మళ్లీ వైద్యురాలిగా నటించడం గమ్మత్తుగా అనిపించింది. అయితే ఆ పాత్రకీ దీనికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యానని చెబుతుంటారు. కానీ నేను మాత్రం యాక్టర్‌నే కావాలనుకున్నా, అయ్యాను. సినిమాల్లో మాత్రం వైద్యురాలిగా నన్ను నేను చూసుకుంటున్నా. ఈ పాత్ర నాకొక సెంటిమెంట్‌ అవుతుందేమో చూడాలి. 'హీరో'లో నటించడం ఓ మంచి అనుభవం. కుటుంబ నేపథ్యంతోపాటు సందర్భోచితమైన కామెడీ ఉంటుంది. నా తండ్రి పాత్రలో జగపతిబాబు నటించారు. ఆయనకీ, నాకూ, హీరోకీ మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య పక్కా వాణిజ్య హంగులతో ఓ భిన్నమైన సినిమాని తీశారు.

hero moviehero movie
హీరో మూవీ

* నాలుగేళ్ల కిందట సినిమా రంగానికి నేను కూడా కొత్తే. తొలి అడుగుల్లో నాకైతే ఏమీ తెలియదు. అంతా సెట్లోకి వచ్చాకే నేర్చుకున్నా. కానీ అశోక్‌ గల్లా అన్నీ నేర్చుకుని కెమెరా ముందుకొచ్చారు. తనతో పనిచేయడం కొత్త నటుడితో చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. అయినా తనకి ఇదే తొలి చిత్రం కాబట్టి సహనటిగా తనని సౌకర్యంగా ఉంచాలనుకున్నా. నా తొలి సినిమా సమయంలో కూడా కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ చక్కటి సహకారం అందించాడు. ఈ సినిమా ప్రయాణంలో నాకు ఆ రోజులు గుర్తుకొచ్చాయి.

* సినిమా ఎంపిక కీలకమే కానీ.. ఆ విషయంలో నేను ఎక్కువగా ఆలోచించను. ఒక ప్రవాహంలా ముందుకు సాగుతున్నానంతే. 'హీరో' ఒప్పుకున్నాక పవన్‌కల్యాణ్‌ సినిమా 'హరి హర వీర మల్లు'లో నటించే అవకాశం వచ్చింది. చిన్నప్పట్నుంచి నా కోరిక హీరోయిన్‌ కావడమే. కానీ అందుకోసమని నేను ప్రత్యేకంగా ఏమీ సన్నద్ధం కాలేదు. సినిమాలు చేస్తూనే నేర్చుకున్నా. హిందీ, తెలుగు, తమిళం.. ఇలా ఒకొక్క భాషలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ అడుగులేశా. ఇప్పుడు చేస్తున్న సినిమా నా గత సినిమా కంటే బాగుండాలనుకుంటా. వేసే ప్రతీ అడుగు మరింత ఉన్నతంగా వేయాలనేదే నా సిద్ధాంతం. ఈ ప్రయాణంలో తెలుగు చిత్రసీమ అన్నిటికంటే సౌకర్యంగా అనిపించింది. నేను ఇక్కడే పుట్టినందుకేమో, తెలుగు చిత్రసీమతో కొంచెం ఎక్కువ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది.

* గ్లామర్‌ అనే మాటకు ఒకొక్కరిదీ ఒక్కో నిర్వచనం. గ్లామరస్‌ హీరోయిన్‌, కమర్షియల్‌ హీరోయిన్‌ అనే గుర్తింపు నాకు రావడంపై నేను చాలా ఆలోచించా. తర్వాత అర్థమైందేమిటంటే ఆ గుర్తింపు రావడంతో నాకు మేలే జరిగిందని. ఆ గుర్తింపుని నేను మనస్ఫూర్తిగా స్వీకరించా. అంతిమంగా నేనొక నటిని. దర్శకులు నా పాత్రని ఎలా మలిస్తే అలా నేను ఇమిడిపోతాను. ‘తడమ్‌’ దర్శకుడు మజిళ్‌ మజిజ్‌ తిరుమేని తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నేను మేకప్‌ లేకుండా చాలా సహజమైన పాత్రలో నటిస్తున్నా. ఓ నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేయగలను. యాక్షన్‌ అంటే ఇష్టం. నేను కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నాను కూడా. యాక్షన్‌ ప్రధానమైన పాత్రలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ‘హరి హర వీరమల్లు’లో కొన్ని యాక్షన్‌ ఘట్టాల్లో కనిపిస్తా. నా కెరీర్‌లో ఓ అత్యుత్తమమైన పాత్ర ఆ సినిమాలోనే ఉండటం ఎంతో ప్రత్యేకం.

Nidhi agarwal
నిధి అగర్వాల్

* గతేడాదంతా నటిస్తూనే ఉన్నా. ఈ ఏడాది వరుసగా నా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ‘హీరో’, ‘హరి హర వీరమల్లు’ తర్వాత తెలుగులో కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఏప్రిల్‌ నుంచి హిందీలో ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో చేసిన సినిమా త్వరలోనే విడుదలదవుతుంది. మరికొన్ని కొత్త చిత్రాలకి ఓకే చెప్పా. అబ్బాయిల విషయంలో ఒకొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. నాకు మాత్రం గౌరవించే వ్యక్తులంటే ఇష్టం. నన్నే కాదు, చుట్టుపక్కల అందరితోనూ గౌరవభావంతో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి.

అగ్ర తారలతోనే కలిసి నటించాలనేమీ లేదు. మంచి కథలు, తారలతో సినిమాలు... ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రయాణం చేసుకోవాలి. ముఖ్యంగా మంచి కథలని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అందుకే ‘హీరో’ గురించి శ్రీరామ్‌ ఆదిత్య నుంచి పిలుపు రాగానే వెళ్లి కథ విన్నా. స్క్రిప్ట్‌ ఆసక్తికరంగా అనిపించింది. భిన్నమైన కథ, అదే సమయంలో వాణిజ్య సూత్రాలతో కూడుకుని ఉంటుంది. ఇందులో డార్క్‌ కామెడీ కూడా ఉంటుంది. కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకొన్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.