సంక్రాంతి రేసులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అయితే.. అగ్రనటులు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ ఈ రేసు నుంచి దూరం కానున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata movie release date) సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్(Bheemla Nayak Movie Updates)' చిత్రాన్ని కూడా మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్పై క్లారిటీ ఇవ్వనుంది.
మహేశ్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు.
పవన్ కల్యాణ్(pawan kalyan new movie), రానా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'(bheemla nayak new update). మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్(ayyappanum koshiyum telugu remake)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు.
మరోవైపు.. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం, ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాలే ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్నాయి. నాగార్జున నటిస్తోన్న 'బంగార్రాజు' కూడా సంక్రాంతి విడుదల కానుంది.
ఇదీ చదవండి: