Nayanthara becomes mother: హీరోయిన్ నయనతార తల్లి కాబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సరోగసి ద్వారా తల్లి అవ్వాలని నయన్ అనుకుంటుందట. ఇందుకు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయన్ చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొంతకాలం వేచి ఉండాల్సిందే.
2015లో తెరకెక్కిన 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ సమయంలో నయన్‌కి విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్డౌన్లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలం నుంచి ఈ జంట పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ గుడిలో నయన్-విఘ్నేశ్ పూజలు నిర్వహించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నయన్ తన పాపిట సింధూరం పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, నయన్-విఘ్నేశ్ కలిసి 'కాతువాక్కుల రెండు కాదల్' మూవీ సినిమా చేస్తున్నారు. విఘ్నేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
నయన్-విఘ్నేశ్‌పై కేసు
complaint on Nayanthara and Vignesh shivan: నయనతార-విఘ్నేశ్‌పై ఓ కేసు నమోదైంది. సలిగ్రమమ్కు చెందిన కన్నన్ అనే సామాజిక కార్యకర్త.. చెన్నై పోలీసు కమిషనర్ ఆఫీస్‌లో వీరిపై కేసు పెట్టారు. "రౌడీలను నియంత్రించేందుకు తమిళనాడు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. కానీ నయన్-విఘ్నేశ్ మాత్రం రౌడీ పిక్చర్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఇది రౌడీలను ప్రోత్సాహించినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలి" అని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా?.. షాక్‌లో ఫ్యాన్స్!