ETV Bharat / sitara

అట్లీ-షారుక్ కాంబోలో సినిమా.. షూటింగ్ షురూ! - అట్లీ షారుఖ్ కాంబో

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ అభిమానులకు శుభవార్త. యువ దర్శకుడు అట్లీతో షారుక్​ సినిమా(Atlee Shahrukh Khan) షూటింగ్​ ప్రారంభమైంది. ఈ సినిమాలో కింగ్ ఖాన్​ సరసన నటించున్న ఇద్దరు తారలు ఇప్పటికే పుణెకు చేరుకున్నట్లు సమాచారం.

srk atlee
షారుఖ్, అట్లీ
author img

By

Published : Sep 4, 2021, 10:19 AM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​ అభిమానులకు గుడ్​ న్యూస్. దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న షారుక్(Shahrukh Khan)​.. కోలీవుడ్​ డైరెక్టర్​తో ఓ సినిమాకు ఓకే చేసినట్లు తెలిసింది. యువ దర్శకుడు అట్లీతో షారుక్​ ఓ భారీ పాన్ ఇండియా చిత్రం(Atlee Shah rukh movie) తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం​ పుణెలో ప్రారంభించినట్లు సమాచారం. ఈ మూవీ చిత్రీకరణ కోసం ప్రముఖ నటి నయనతార, ప్రియమణి పుణెకు చేరుకున్నట్లు తెలిసింది.

ఈ చిత్రంపై కొంత కాలం నుంచి భారీగా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతం కూడా ముగిసినట్లు టాక్. అనిరుద్ రవిచందర్​ ఈ సినిమాకు సంగీతం ఇవ్వనున్నారు. అయితే.. ఈ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పఠాన్‌'లో (Pathan Movie) షారుక్ ఖాన్‌ నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా దీపికా (Deepika Padukone) పదుకొణె కనిపించనుండగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. సల్మాన్ ఖాన్(Salman Khan) అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు.

ఇదీ చదవండి:ఆగస్టులో సెట్స్​పైకి షారుక్, అట్లీ సినిమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.