ETV Bharat / sitara

Kangana: నిర్మాతగా, వ్యాఖ్యాతగా తొలి అడుగులు​! - టెంప్టేషన్‌ ఐస్‌ల్యాండ్‌ కంగన

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​(Kangana Ranaut).. అటు నిర్మాతగా, ఇటు వ్యాఖ్యాతగా ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మణికర్ణిక ఫిలిమ్స్​ బ్యానర్​పై తొలి చిత్రంగా 'టిక్​ వెడ్స్​ షేరు'ను(Tiku Weds Sheru) నిర్మించనుంది. అందులో ప్రముఖ నటుడు నవాజుద్దీన్​ సిద్దిఖీ(Nawazuddin Siddiqui) ప్రధానపాత్ర పోషించనున్నాడు. దీంతో పాటు త్వరలోనే భారత్​లో ప్రసారంకానున్న ఓ అమెరికన్​ షోకు వ్యాఖ్యాతగా చేసేందుకు కంగన ఇటీవలే అంగీకారం తెలిపనట్లు బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

Nawazuddin Siddiqui to star in Kangana's production 'Tiku Weds Sheru'
Kangana: నిర్మాతగా, వ్యాఖ్యాతగా తొలి అడుగులు​!
author img

By

Published : Jul 15, 2021, 7:01 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌(Kangana Ranaut) దర్శకత్వంతో పాటు చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. గతేడాది మణికర్ణిక ఫిలిమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ నుంచి రానున్న తొలి చిత్రం 'టికు వెడ్స్‌ షేరు'(Tiku Weds Sheru). ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ(Nawazuddin Siddiqui) నటిస్తున్నట్లు మణికర్ణిక ఫిలిమ్స్‌ ప్రకటించింది.

"ఆయన ఈతరం నటుల్లో గొప్పవారు. మా సింహం దొరికినందుకు గర్వంగా ఉంది. త్వరలోనే 'టికు వెడ్స్‌ షేరు' చిత్రీకరణ మొదలుకానుంది" అని నటుడు నవాజుద్దీన్‌ ఫొటోను షేర్‌ చేసింది చిత్ర బృందం. ముందుగా ఈ పాత్ర కోసం ఇర్ఫాన్‌ఖాన్‌ అని అనుకున్నారు. కానీ ఆయన మరణించడం వల్ల ఈ ప్రాజెక్టు ఆగింది. ఈ చిత్రంలో కంగన నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

నయా అవతార్​..

అటు దర్శకత్వం.. ఇటు నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టిన కంగన రనౌత్‌ ఇప్పుడు హోస్ట్‌ అవతారం ఎత్తనుంది. ఇప్పటికే నటిగా నిరూపించుకున్న ఆమె.. దర్శకురాలిగా, నిర్మాతగా మారి కొన్ని సినిమాలు తెరకెక్కిస్తోంది. ఇప్పుడు హోస్ట్‌గా ఓటీటీలోకి ప్రవేశించనుంది. అమెరికాలో ప్రసారమయ్యే రియాలిటీ షో 'టెంప్టేషన్‌ ఐస్‌ల్యాండ్‌'ను(Temptation Island) పోలిన కార్యక్రమాన్ని భారత్‌లోనూ ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీయువకులు జంటలుగా కొంతకాలం పాటు కలిసి ఒక దీవిలో ఉంటారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించే కంగన వాళ్లకు ప్రేమ పాఠాలు చెప్పనుంది. సదరు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఇప్పటికే ఒప్పందంపై సంతకం కూడా చేసిందట. అతి త్వరలోనే ఆ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కంగన బాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాదిలోనూ కూడా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె నటించిన 'తలైవి'(Thalaivi) విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో పాటు 'ధాకడ్‌', 'తేజాస్‌', 'మణికర్ణిక' సీక్వెల్​, 'ఎమర్జెన్సీ' వంటి చిత్రాలన్నీ దాదాపు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి.. Rakshasudu 2: 'రాక్షసుడు 2'లో హీరోగా తమిళ స్టార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.