ETV Bharat / sitara

తొలిసారి తెలంగాణ యాస పలకబోతున్న నాని! - తెలంగాణ యాస నేర్చుకుంటున్న నాని

నేచురల్ స్టార్ నాని, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్​ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇందులో నాని తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిలా కనిపిస్తాడట.

నాని
నాని
author img

By

Published : May 24, 2020, 5:31 AM IST

సరికొత్త కథలతో వచ్చే దర్శకులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాడు యువ కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణతో చేస్తున్న 'టక్‌ జగదీష్‌' మినహా ఆ తర్వాత చేయబోయే చిత్రాలన్నీ నవతరం డైరెక్టర్లతో చేయనున్నవే. వీటిలో రాహుల్‌ సంకృత్యాన్, వివేక్‌ ఆత్రేయ చిత్రాలతో పాటు సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌తో చేయనున్న ఓ కొత్త చిత్రమూ ఉంది. దీన్ని సుధాకర్‌ చెరకూరి నిర్మించనున్నారు.

వచ్చే ఏడాది ద్వితియార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం నాని తొలిసారిగా తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పబోతున్నాడట. ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌' కోసం గోదావరి యాస మీద పట్టు సంపాదించుకున్నాడు. గతంలోనూ 'కృష్ణార్జున యుద్ధం'లోనూ చిత్తూరు యాసలో సంభాషణలు పలికించాడు. ఇప్పడీ క్రమంలోనే ఈ రాబోయే కొత్త ప్రాజెక్టు కోసం తెలంగాణ యాసలోనూ తన పట్టును ప్రదర్శించనున్నాడని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.