ETV Bharat / sitara

Akhanda: బాలయ్య జోరు.. 'అఖండ' డబ్బింగ్​ షురూ.. - అఖండ రిలీజ్ డేట్

కథానాయకుడు బాలకృష్ణ(Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న చిత్రం 'అఖండ'పై(Akhanda Latest News) ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ బుధవారం నుంచి తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు.

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Sep 2, 2021, 6:59 AM IST

కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna).. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అఖండ'(Akhanda Latest News). మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ(Nandamuri Balakrishna) బుధవారం నుంచి తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు.

దసరా లక్ష్యంగా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తొలి పాట విడుదల చేసి(Akhanda Songs release date).. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. 'సింహా', 'లెజెండ్‌' లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలయిక నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇదీ చదవండి:శరవేగంగా 'అఖండ' షూటింగ్​.. దసరాకే రిలీజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.