"నా పిల్లలిద్దరినీ కులమతాలకు అతీతంగా పెంచుతున్నా" అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్. 'డాన్స్ ప్లస్ 5' అనే రియాలిటీ షోలో పాల్గొన్న షారూఖ్.. ఆ కార్యక్రమంలో మతంపై చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అందులో మాటల సందర్భంగా మతాల ప్రస్తావన రాగా.. తాము భారతీయులమని కింగ్‌ఖాన్ గర్వంగా చెప్పుకొన్నారు.
-
My wife is Hindu, I am a Muslim and my kids are Hindustan. My daughter was asked the religion in school form, I told her we are Indians 🇮🇳 ❤️ - The pride of India Shah Rukh Khan. #RepublicDayIndia #RepublicDay2020 pic.twitter.com/Qk95xxLT3j
— Neel Joshi (@neeljoshiii) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My wife is Hindu, I am a Muslim and my kids are Hindustan. My daughter was asked the religion in school form, I told her we are Indians 🇮🇳 ❤️ - The pride of India Shah Rukh Khan. #RepublicDayIndia #RepublicDay2020 pic.twitter.com/Qk95xxLT3j
— Neel Joshi (@neeljoshiii) January 25, 2020My wife is Hindu, I am a Muslim and my kids are Hindustan. My daughter was asked the religion in school form, I told her we are Indians 🇮🇳 ❤️ - The pride of India Shah Rukh Khan. #RepublicDayIndia #RepublicDay2020 pic.twitter.com/Qk95xxLT3j
— Neel Joshi (@neeljoshiii) January 25, 2020
"నేను ముస్లిం, నా భార్య హిందూ, మా పిల్లలు ఇండియన్స్. నా కూతురు సుహానా తన చిన్నతనంలో నన్నొక ప్రశ్న అడిగింది. తన స్కూల్ అప్లికేషన్‌లో మత ప్రస్తావన వచ్చినప్పుడు 'నాన్న.. మన మతం ఏంటి?' అని అడిగింది. దానికి నేను మనకు మతం లేదు.. మనం ఇండియన్స్ అని చెప్పి ఆ అప్లికేషన్‌లోనూ అలాగే రాయించా' అని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. మతంపై కింగ్ ఖాన్ చెప్పిన సమాధానాన్ని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఇకపై తాము తమ పిల్లలకు ఇలాగే చెప్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. ఆస్కార్ వేడుకలో ఆకుకూరల భోజనమే!