ETV Bharat / sitara

లతా మంగేష్కర్ పేరిట మ్యూజిక్​ అకాడమీ, రాష్ట్ర అవార్డు - awards on the memory of lata mangeshkar

గానకోకిల లతా మంగేష్కర్​ జ్ఞాపకార్ధం సంగీత అకాడమీలను ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ ప్రభుత్వాలు ప్రకటించాయి. కొవిడ్ సహా అనారోగ్య సమస్యల కారణంగా లత ఇటీవల మరణించారు.

latha mangeshkar
లతా మంగేష్కర్​
author img

By

Published : Feb 10, 2022, 1:04 PM IST

Updated : Feb 10, 2022, 2:51 PM IST

ఇటీవల మరణించిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ జ్ఞాపకార్థం సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముంబయి యూనివర్సిటీలోని కలీనా క్యాంపెస్​లో దీనిని నిర్మిస్తామని తెలిపింది.

ముంబయి శివాజీ పార్క్​లో లతా మంగేష్కర్​ పేరిట స్మారక చిహ్నాన్ని నిర్మించాలని.. కొన్నిరోజుల క్రితం భాజపా ఎమ్మెల్యే రామ్​కదమ్.. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు​ లేఖ రాశారు. ప్రస్తుతం శివాజీ పార్క్​లో బాలాసాహెబ్​ ఠాక్రే స్మారక చిహ్నం ఉంది.

మరోవైపు, లతా మంగేష్కర్ పుట్టిన ఊరు ఇండోర్​లో ఆమె పేరిట మ్యూజియం సహా సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తామని మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. ఆమె పుట్టినరోజున కళాకారులకు రాష్ట్రీయ అవార్డులను అందిస్తామని పేర్కొంది.

కొవిడ్ పాజిటివ్​గా తేలడం వల్ల లతా మంగేష్కర్.. జనవరి 8న ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్దిరోజులకు కోలుకున్నారు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం లత తుదిశ్వాస విడిచారు. నేడు(గురువారం) లతా మంగేష్కర్​ హస్తికలను ఆమె కుటుంబసభ్యులు నాసిక్​ రాంకుండ్​లోని గోదావరి నదిలో కలిపారు.

lata mangeskar
లతా మంగేష్కర్​ హస్తికలను నాసిక్​ రాంకుండ్​లోని గోదావరి నదిలో కలిపారు

ఇవీ చదవండి:

Last Updated : Feb 10, 2022, 2:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.