ETV Bharat / sitara

ఇదే మోహన్​ బాబు ఇల్లు.. చూస్తే షాకవుతారు! - మోహన్‌బాబు హోంటూర్​

Mohan Babu home tour: సీనియర్​ నటుడు మోహన్​ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేశారు నటి మంచు లక్ష్మి. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఇంటిపై ఆమె హోం టూర్ వీడియో చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

mohanbabu home tour
మోహన్ బాబు ఇల్లు
author img

By

Published : Dec 28, 2021, 2:07 PM IST

Mohan Babu home tour: తన తండ్రి, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఇంటిని నటి మంచులక్ష్మి నెటిజన్లకు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఇంటిపై ఆమె హోంటూర్ వీడియో చేశారు. దానికి సంబంధించిన ప్రోమోని ఇటీవలే ఆమె యూట్యూబ్‌ వేదికగా షేర్ చేశారు. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ ఇంటిని పరిచయం చేస్తూ.. "ఇది మా నాన్న కట్టించుకున్న ఆరో ఇల్లు" అంటూ ఏరియల్‌ వ్యూ చూపించారు. ప్రవేశ ద్వారంతోపాటు ఇంటిబయట గోడలపై మోహన్‌బాబు తన అభిరుచికి తగ్గట్టు అద్భుతమైన కళాకృతులను చెక్కించుకున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు.

'మహానటి' సినిమాలో 'ఘటోత్కచుడి'గా తాను చేసిన పాత్రకు సంబంధించిన ఫొటోని పెద్ద ఫ్రేమ్‌ చేయించి మెట్ల మార్గంపై పెట్టించారు మోహన్​బాబు. లివింగ్‌, ఆఫీస్‌ రూమ్స్‌ గోడలపై తనకి వచ్చిన అవార్డులు, తన సినిమాలకు సంబంధించిన మధురజ్ఞాపకాలతో నింపేశారు. ఇలా ఎంతో సరదాగా సాగుతోన్న ఈ వీడియో చివర్లో.. "ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తున్నావా" అని మోహన్‌బాబు ప్రశ్నిస్తూ కనిపించగా.. "ఇప్పటికే చూపించేశాం కదా నాన్నా" అని లక్ష్మి సమాధానం చెప్పడం వల్ల ఆయన ఆమెను సరదాగా పక్కకు తోసివేశారు. అనంతరం తన మనవరాలు, లక్ష్మి కుమార్తెతో సరదాగా ఫైట్‌ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కలెక్షన్ కింగ్ మోహన్​బాబు.. సరికొత్తగా వెబ్ సిరీస్​లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.