ETV Bharat / sitara

MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్​ ఇదే - మంచు విష్ణు ప్యానల్

'మా' ఎన్నికలు(MAA Elections 2021) సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి పోటీదారులు ప్రచారంలో దూకుడు పెంచారు. అక్టోబరు 10న జరిగే ఈ ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హీరో విష్ణు.. తన ప్యానల్​ను(Manchu Vishnu Panel For MAA) ప్రకటించారు. 26 మందితో కూడిన జాబితాను గురువారం ఉదయం విడుదల చేశారు.

Manchu Vishnu Announced His Panel Members For MAA Elections
మంచు విష్ణు ప్యానల్​
author img

By

Published : Sep 23, 2021, 11:22 AM IST

Updated : Sep 23, 2021, 11:54 AM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై(MAA Elections 2021) గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఏడాది 'మా' అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు బరిలోకి దిగారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ను ప్రకటించి.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన వ్యుహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 10న(MAA Elections 2021 Date) 'మా' ఎన్నికలు జరగనున్న తరుణంలో గురువారం ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ను(Manchu Vishnu Panel For MAA) ప్రకటించారు. తన ప్యానల్‌ నుంచి ఎవరెవరు.. ఏ ఏ పదవుల కోసం పోటీ చేస్తున్నారు.. అనే విషయాలను ఆయన వెల్లడించారు.

'మా' అధ్యక్ష పదవికి హీరో విష్ణు పోటీ చేస్తుండగా.. ఉపాధ్యక్షులుగా మాదాల రవి, పృథ్వీరాజ్​ బరిలో నిలిచారు. విష్ణు ప్యానల్(Manchu Vishnu Panel For MAA)​ నుంచి జనరల్​ సెక్రటరీగా రఘుబాబు.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహన్ పోటీ చేయనున్నారు. హీరో విష్ణు ప్యానల్​కు 'మా' మాజీ అధ్యక్షుడు(MAA President) నరేశ్ మద్దతు ప్రకటించారు.

Manchu Vishnu Announced His Panel Members For MAA Elections
మంచు విష్ణు ప్యానల్​

'మా' కోసం మనమందరం

1.మంచు విష్ణు - అధ్యక్షుడు
2.రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ
3.బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
4.మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌
5.పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌
6.శివబాలాజీ - కోశాధికారి
7.కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
8.గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ
9.అర్చన
10.అశోక్‌కుమార్‌
11.గీతాసింగ్‌
12.హరినాథ్‌బాబు
13.జయవాణి
14.మలక్‌పేట్‌ శైలజ
15.మాణిక్‌
16.పూజిత
17.రాజేశ్వరీ రెడ్డి
18.సంపూర్ణేశ్‌ బాబు
19.శశాంక్‌
20.శివన్నారాయణ
21.శ్రీలక్ష్మి
22.శ్రీనివాసులు
23.స్వప్నా మాధురి
24.విష్ణు బొప్పన
25.వడ్లపట్ల

ఇంతకుముందు నరేశ్​ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గంలో శివబాలాజీ, గౌతమ్ రాజ్​లు జాయింట్ సెక్రటరీగా పోటీ చేసి గెలుపొందగా.. మంచు విష్ణు ప్యానల్ నుంచి వీరిద్దరు మరోసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఈసీ సభ్యులుగా పనిచేసిన పృథ్వీరాజ్, కరాటే కళ్యాణి.. ఈసారి కూడా ఈసీ సభ్యులుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్​లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు 'మా' అసోసియేషన్​ ఎన్నికలు జరుగనున్నాయి.

ఇదీచూడండి.. MAA Elections: మంచు విష్ణు ప్యానల్​లో ఎవరున్నారంటే?

Last Updated : Sep 23, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.