Maheshbabu Trivikram hatrick movie: 'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. మహేశ్ 28వ చిత్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గ్రాండ్‌గా మొదలైంది. గురువారం ఉదయం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో వేడుకగా జరిగింది. ముహూర్తపు షాట్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. చిత్రబృందంతోపాటు మహేశ్‌బాబు సతీమణి నమ్రత ఈ వేడుకలో పాల్గొన్నారు. పూజాహెగ్డే సైతం తళుక్కున మెరిశారు. ఇక మహేశ్‌బాబు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. కాగా, మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఇందులో కీర్తిసురేశ్ హారోయిన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహేశ్ అందుకే రాలేదా?
Mahesh Babu Sentiment: సాధారణంగా చిత్రసీమలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. స్టార్ హీరోలు కూడా దానికి మినహాయింపు కాదు. కాగా, మహేశ్‌కు కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయట! తన సినిమా ఓపెనింగ్స్‌కు ఆయన రాడని తెలిసింది. చాలా ఏళ్లుగా మహేశ్‌కు అది ఒక సెంటిమెంట్. అందుకే కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు ఆయన భార్య నమ్రత మాత్రమే వస్తుందట.
మరిన్ని అప్డేట్స్
ఇదీ చదవండి:
అల్లుఅర్జున్-హరీశ్ శంకర్ కాంబోలో మరో సినిమా?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!