ETV Bharat / sitara

'సర్కారు వారి పాట'లో మహేశ్ డ్యుయల్ రోల్! - Mahesh Babu news

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

'సర్కారు వారి పాట'లో మహేశ్ డ్యుయల్ రోల్!

author img

By

Published : Sep 4, 2020, 4:11 PM IST

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 'సర్కారు వారి పాట'లో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాలీవుడ్‌ టాక్‌. వీటిలో ఒకటి పాన్‌ బ్రోకర్‌ కాగా, మరొకటి బ్యాంకు ఆఫీసర్‌గా కనిపిస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, ఒకరే రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారా? లేక ద్విపాత్రాభినయమా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమాను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత షెడ్యూల్‌ను ఇక్కడే తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.