Sarkaru vaari paata song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' తొలి పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ పాట పేరు 'కళావతి'. ఈ గీతం.. ప్రేమికుల రోజున విడుదల కానుంది.

ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతమందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
టిల్లు పాట..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
DJ Tillu movie: 'డీజే టిల్లు' సినిమా నుంచి 'నువ్వలా' అనే పాట విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిని స్వయంగా హీరో సిద్ధు పాడటం విశేషం. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. నేహా శెట్టి హీరోయిన్లుగా నటించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.
స్నేహితుల కోసం దుల్కర్..

తమిళ నటుడు అశోక్ సెల్వన్ నటిస్తున్న కొత్త చిత్రం 'ఆకాశం'. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా చేస్తున్న తన స్నేహితులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అపర్ణ బాలమురళి, రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈ చిత్రాన్ని కార్తీక్ తెరకెక్కిస్తున్నారు.



ఇదీ చూడండి: 'ఖిలాడి' సెన్సార్ పూర్తి.. ఈద్‌కే రానున్న సల్మాన్