సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ఆదివారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపించారు. దీంతో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ వచ్చిన మహేశ్.. హిట్ సొంతం చేసుకున్నారు. అనంతరం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. కానీ కరోనా ప్రభావం వల్ల దాని షూటింగ్ ఆలస్యమైంది.
ఇటీవలే పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పరశురామ్.. అమెరికాలోని లోకేషన్ల వెతకడం కోసం వెళ్లారు. ఇప్పుడు మహేశ్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం వల్ల షూటింగ్ కోసం వెళ్తున్నారా? లేదంటే విహారయాత్ర కోసమా? అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో 'సర్కారు వారి పాట' షూటింగ్..?